Home తాజా వార్తలు సోమాలియా విమానాశ్రయంలో జంట పేలుళ్లు

సోమాలియా విమానాశ్రయంలో జంట పేలుళ్లు

Massive-Blasts-at-Mogadishu

మొగదిషు: సోమాలియా రాజధాని నగరం మొగదిషులోని అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం జంట పేలుళ్లతోపాటు భారీగా కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఎయిర్‌పోర్టులోని చెక్‌పాయింట్ వద్ద మొదటి పేలుడు, పీస్ హోటల్ ప్రాంతంలో రెండో పేలుడు సంభవించినట్లు విమానాశ్రయం రక్షణ సిబ్బంది అధికారులు తెలిపారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియరాలేదు.