Search
Sunday 18 November 2018
  • :
  • :

తుపాకీకి తుప్పు పట్టిద్దాం

int

 అమెరికాలో  గన్‌కల్చర్‌కు వ్యతిరేకంగా భారీ ప్రదర్శనలు

   వీధుల్లోకి లక్షలాదిగా ప్రజలు

వాషింగ్టన్  : అమెరికాలో తుపాకీ సంస్కృతిని నిరసిస్తూ భారీ స్థాయిలో ప్రదర్శనలు జరిగాయి. పలు నగరాలు, పట్టణాలలో ఆదివారం పది లక్షలకు పై గా జనం వీధులలోకి వచ్చి, గన్‌కల్చర్‌ను నిరసిస్తూ నినదించారు. రాజకీయ నాయకులూ ఇప్పటికైనా స్పందించండి లేదా వైదొలగండి  (గెటౌట్) అంటూ ఫ్లోరిడాలో 17 ఏళ్ల విద్యార్థి కెమెరాన్ కాస్కీ ఎలుగె త్తి చాటారు. గత నెలలో ఫ్లోరిడాలో జరిగిన కాల్పు ల్లో 17 మంది విద్యార్థులు మృతి చెందారు. పలువురు ఈ చర్యలో గాయపడ్డారు. తరచూ స్కూళ్లలో తుపాకులు నినదిస్తూ ఉన్నా, విద్యార్థులు బలి అవు తూ ఉన్నా గన్ వ్యాపారం సజావుగా సాగడం, తుపాకుల వాడకం నిబంధనల్లో మార్పులు రాకపోవడంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ప్రత్యేకించి స్కూల్ విద్యార్థుల ఆధ్వర్యంలోనే ఉద్య మం మొదలైంది. ఫ్లోరిడా, న్యూయార్క్, డల్లాస్,  బోస్టన్, చికాగో, మినియాపోలిస్, అట్లాం టా, డెన్వెర్, మియామీ వంటి పలు చోట్ల భారీ స్థాయిలో ప్రదర్శనలు సాగాయి. తమ ప్రాణాల రక్షణ కోసం ఈ ప్రదర్శన అని పేర్కొంటూ భారీ సంఖ్యలో విద్యార్థులు నినదించారు. విద్యార్థుల పౌరుల రక్షణకు ముందుకు రావాలని లేకపోతే ఓటర్లు వస్తారని తగు విధంగా బుద్ధి చెపుతారని ప్రదర్శనకారులుతెలిపారు. దేశంలో గన్ వ్యాపారు ల లాబీతో అధికార రాజకీయ వర్గాలకు సంబంధా లు ఉన్నాయని, దీని వల్లనే గన్‌కల్చర్‌కు కళ్లెం పడటం లేదనే విమర్శలు తలెత్తుతున్నాయి. న్యూ యార్క్‌లో 1,75,౦౦ మందితో ప్రదర్శన సాగింది. ఈ విద్యార్థుల నిరసన ర్యాలీ అమెరికా చరిత్రను మార్చివేస్తుందని న్యూయార్క్ నగర మేయర్ బిల్ డే బ్లాసియో స్పందించారు. అయితే దాదాపు 8 లక్షల మందితో వాషింగ్టన్‌లో ర్యాలీ జరిగిందని ఎన్‌బిసి న్యూస్ తెలిపింది. మారణాయుధాల అమ్మకాలపై నిషేధ నిర్ణయం తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారని, ఆయుధాల వాడకందార్ల పూర్వాపరాలను పర్యవేక్షించడంతో ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకోవడం కీలకం అని, లేకపోతే  దారుణాలు జరుగుతాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

comments