Home Default దేశరాజధానిలో భారీ అగ్నిప్రమాదం

దేశరాజధానిలో భారీ అగ్నిప్రమాదం

Fire Accident at Delhi

 

న్యూఢిల్లీ: దేశరాజధానిలో ఓ ప్రభుత్వ భవనంలో సోమవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మధ్య ఢిల్లీలోని వికాస్‌ భవన్‌ ఆరో అంతస్తులో ఈ ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని సహాయకచర్యలు చేపట్టింది. భవనంలో ఏర్పాటుచేసిన ఒక ఏసీలో సాంకేతిక లోపం తలెత్తి షాట్‌ షర్క్యూట్‌ జరిగిందని, దీంతో మంటలు చెలరేగాయని అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణహానీ జరగలేదు.
గతవారం ఢిల్లీ లోధి రోడ్‌లోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సముదాయమైన పండిత్‌ దీన్‌దయాళ్‌ అంత్యోదయ్‌ భవనంలోనూ అగ్నిప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే.

Massive Fire Accident in New Delhi