Home అంతర్జాతీయ వార్తలు ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో భారీ పోలింగ్

ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో భారీ పోలింగ్

israilటెహ్రాన్: ఇరాన్ అధ్యక్షఎన్నికల్లో శుక్రవారం పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తారు. అధ్యక్షుడు హసన్ రౌహాని, ప్రపంచంతో సంబంధాల పునర్ నిర్మాణం, ఆర్థిక వ్యవస్థ నుగట్టెక్కించడంపై ఓటర్లు తమ అభిప్రాయాన్ని వెల్లడించనున్నారు. ఎన్నికల సందర్భం గా టెహ్రాన్‌లో పండగ వాతావరణం నెలకొంది. సిటి సెంటర్ మసీద్‌లో రౌహాని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల్లో ఇరానీయన్లు ఉత్సాహంగా పాల్గొ నడం జాతీయ శక్తి, భద్రతను మరింత బలపరుస్తోందని ఆయన అన్నారు. పౌర హక్కు లు, ఉగ్రవాదం రెండింటిలో ఎవరికి ఓటు వేయాలనే నిర్ణయించుకోవాలని హసన్ రౌహాని కోరుతున్నారు. కాగా, పేద ప్రజల మద్దతుతోపాటు పశ్చిమ దేశాలతో మరింత కఠినంగా ఉండాలన్న మత గురువు ఇబ్రహీం రైసీ ప్రధాన ప్రత్యర్థిగా పోటీలో ఉన్నారు. దక్షిణ టెహ్రాన్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న రైసీ ప్రజల ఓటు హక్కును గౌరవిం చాల్సిన అవసరం ఉందన్నారు. కార్మిక వర్గం, నిరుద్యోగులు,1979లో ఇరాన్ విప్లవ విలువలకు ప్రమాదం ఉందని భావిస్తున్న వర్గాలను ఆయన  ఆకట్టుకుంటు న్నారు. ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం మత నాయకుడు  ఆయతుల్లా అలీ ఖమేనీ మాట్లాడుతూ దేశ భవిష్యత్తు ఇరానీయన్ల చేతిలో ఉందన్నారు. నలుగురు అభ్య ర్థులు పోటీలో ఉండగా మిగతా ఇద్దరు అభ్యర్థులు రౌహాని లేదా రైసీకి మద్దతు తెలుపుతున్నారు.