Home జాతీయ వార్తలు డోన్‌లో భారీ చోరీ

డోన్‌లో భారీ చోరీ

Kurnool : Massive theft in Dhone Town

కర్నూలు : డోన్ పట్టణంలో బుధవారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. హోంటౌన్ కాలనీలోని పాపిరెడ్డి అనే వ్యక్తి ఇంట్లో దొంగలు చొరబడి చోరీ చేశారు. తన భార్య లక్ష్మీదేవి అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ క్రమంలో చికిత్స కోసం పాపిరెడ్డి తన భార్య లక్ష్మీదేవిని తీసుకుని హైదరాబాద్‌కు వెళ్లారు. చికిత్స అనంతరం బుధవారం రాత్రి ఆయన తిరిగి ఇంటికి వచ్చారు. ఇంటి తాళాలు పగులగొట్టి ఉండడంతో ఆయన పోలీసులకు సమాచారం అందించారు. క్లూస్ టీంతో పోలీసులు ఆధారాలు సేకరించారు. ఆధారాలు దొరక్కుండా దొంగలు సిసి కెమెరాలను ధ్వంసం చేశారు. ఇంట్లో దాచి పెట్టిన రూ.3లక్షల నగదు, 30 తులాల బంగారం చోరీకి గురైనట్టు బాధితుడు పాపిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Massive theft in Dhone Town