Home కుమ్రం భీం ఆసిఫాబాద్ మీనాక్షి జ్యూవెల్లరీలో భారీ చోరీ

మీనాక్షి జ్యూవెల్లరీలో భారీ చోరీ

theft

కాగజ్‌నగర్: కాగజ్‌నగర్ పట్టణం మెయిన్ రోడ్డులో గల మీనాక్షి జ్యూవెల్లరీ షాపులో శనివారం రాత్రి భారీ చోరీ జరిగింది. సంఘటన స్థలాన్ని జిల్లా ఎస్‌పి కల్మేశ్వర్ సింగన్‌వార్ పరిశీలించారు. కాగజ్‌నగర్ డిఎస్‌పి సాంబయ్య, సిఐ వెంకటేశ్వర్‌ల ఆధ్వర్యంలో పోలీసులు విచారణ చేపట్టారు. షాపులో ఉన్న 62 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయని, వాటి విలువ 24 లక్షల వరకు ఉంటుందన్నారు. సంఘటన స్థలానికి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా డ్యాగ్‌స్క్వాడ్స్‌తో పాటు, క్లూటీం బృందాన్ని రంగంలోకి దించారు.క్లూటీం బృందం షాపులోని వేలిముంద్రలను సేకరించారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్‌పి కల్మేశ్వర్ సింగన్‌వార్ మాట్లాడుతూ శనివారం రాత్రి దొంగలు కారులో వచ్చి షాపు షెటర్ తాళాలను పగులగొట్టి షెటర్‌ను నుంచి లోపలికి చొరబడి షాపులోని విలువైన బంగారు అభరణాలను ఎత్తుకెళ్ళారన్నారు. చోరీకి పాల్పడిన దొంగలు మహారాష్ట్ర నుంచి వచ్చి ఉంటారని, చోరీ చేసిన అనంతరం మహారాష్ట్రవైపు వెళ్ళి ఉంటారని ఆయన అనుమానం వ్యక్తంచేశారు. షాపు యాజమాని కొలిపాకచంద్రశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, చోరీకి పాల్పడిన దొంగలను త్వరలోనే పట్టుకుంటామన్నారు. జిల్లా ఎస్‌పితో పాటు డిఎస్‌పి సాంబయ్య, సిఐ వెంకటేశ్వర్, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది ఉన్నారు.