Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

రెజిమెంటల్ బజార్‌లో భారీ చోరీ

Massive Theft in Regimental Bazar

హైదరాబాద్ : గోపాలపురం పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న రెజిమెంటల్ బజార్‌లో భారీ చోరీ జరిగింది. ఓ ఇంట్లోకి చొరబడిన దొంగలు రూ.15లక్షల నగదు, 10తులాల బంగారు నగలను అపహరించారు. ఎటువంటి ఆధారాలు లేకుండా చేసేందుకు దొంగలు చోరీ చేసిన అనంతరం ఇంట్లో కారం చల్లారు. దీపావళి సందర్భంగా ఆ ఇంటివారు బంధువుల ఇంటికి వెళ్లిన సమయంలో ఈ చోరీ జరిగింది. శుక్రవారం ఇంటి యజమాని వచ్చి చోరీ జరిగిన విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Massive Theft in Regimental Bazar

Comments

comments