Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

స్పిన్నర్లతో ఫలితం రాబట్టిన కోహ్లి

KOHLIకాన్పూర్‌ : కాన్పూర్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న చరిత్రాత్మక టెస్టు మ్యాచ్‌లో భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి స్పిన్నర్లను ప్రయోగించి ఫలితం రాబడుతున్నాడు. ఆటలో మూడోరోజైన శనివారం 152/1తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన న్యూజిలాండ్‌ పరుగు వ్యవధిలోనే వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలిస్తున్నట్లు కన్పించడంతో ఆరంభం నుంచి అశ్విన్‌, జడేజాలను కివీస్‌ బ్యాట్స్‌మెన్లపైకి కోహ్లి వరుసగా ప్రయోగించాడు. జట్టు స్కోరు 159 వద్ద ఓపెనర్‌ లాథమ్‌ (58: 151 బంతుల్లో 5×4) అశ్విన్‌ విసిరిన బంతిని అంచనా వేయడంలో విఫలమై వికెట్ల ముందు దొరికిపోగా.. అనంతరం వచ్చిన రాస్‌ టేలర్‌ పరుగులేమీ చేయకుండానే జడేజా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. ప్రస్తుతం న్యూజిలాండ్‌ 160/3తో కొనసాగుతోంది.

Comments

comments