Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

గణితం అన్నీ శాస్త్రాలకు తల్లి లాంటిది

గణితంను చూసి భయపడొద్దు
నిజ జీవితంలో ఎంతో దోహదపడుతుంది
రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి
సదస్సులో సావనీర్ విడుదల చేసిన చైర్మన్
PAPIREDDYఘట్‌కేసర్ రూరల్: గణిత శాస్త్రం మిగత శాస్త్రాలకు తల్లి వంటిదని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని అవుశాపూర్ విజ్ఞాన భారతి ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ గణిత శాస్త్ర సంఘం (ఎపి ఎస్‌ఎంఎస్) నిర్వహించిన 24వ జాతీయ స్థాయి సమ్మేళనానికి ఆయన ముఖ్య అథితిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. మూడు రోజుల పాటు సాగే జాతీయ స్థాయి గణిత సమ్మేళనానికి వివిధ రాష్ట్రాల నుంచి అధ్యాపకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణిత శాస్త్రం మిగత శాస్త్రాలకు మూలమన్నారు. గణితంను చూసి భయపడవద్దని విద్యార్థులకు సూచించారు. పాఠశాల స్థాయి నుంచి గణితంపై పట్టు సాధించినప్పుడే భవిష్యత్ చదువులకు సులువుగా ఉంటుందన్నారు. మన చదువులకు గణితం పునాదిలాటిందన్నారు. సరైన పద్ధతిలో గణిత శాస్త్రాన్ని నేర్చుకోవాలన్నారు. ఇంజినీరింగు విద్యకు గణితం లేనిదే ముందుకు సాగలేమన్నారు. అధ్యాపకులు విద్యార్థులకు గణితం అర్థమయ్యే విధంగా బోధన చేయాలన్నారు. గణిత శాస్త్రంపై నిర్లక్షం వదిపెట్టాలని, అధ్యాపకులు గణితంలో ఉన్న మెళుకువలను విద్యార్థులకు నేర్పించాలన్నారు. నిజ జీవితంలో గణితం చాల ఉపయెగపడుతుందని అన్నారు. కష్టపడితే అది చాలా సులువుగా ఉంటుందన్నారు. గణితంను ప్రజలలోకి తీసుకెళ్లాడానికి ఈ సదస్సులు దోహదపడుతాయన్నారు. అనంతంరం గణిత శాస్త్రంపై సావనీరు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గణిత శాస్త్ర సంఘం అధ్యక్షురాలు ప్రొఫేసర్ మహేశ్వరి, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, కళాశాల చైర్మన్ గౌతంరావు, కార్యదర్శి జి. మనోహర్‌రెడ్డి, ప్రిన్సిపాల్ అమరేందర్‌రావు, వైస్ ప్రిన్సిపాల్ కులకర్ణి, హెచ్ అయిండ్ ఎస్ విభాగాదిపతి ప్రోఫెసర్ కౌసల్య, అధ్యాపకులు శ్రీనాద్, హేమసుందర్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments