Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

మత్తుపానీయాలతో జీవితాలు చిత్తు

POLICE

*మత్తుపదార్థాలను పండించిన, సహకరించిన వారిపై చర్యలు తప్పవు : సంగారెడ్డి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి
*మాదకద్రవ్యాల కేసులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి : వరంగల్ స్పెషల్ జడ్జీ దుర్గాజీ
*ఎస్పీ కార్యాలయంలో అవగాహన సదస్సు

మన తెలంగాణ/సంగారెడ్డి క్రైం : మత్తుపానీయాలు వాడకం ద్వారా మనిషి జీవితం నాశనమవుతుందని, మత్తుపానీయాలు, మాదకద్రవ్యాలు పండించిన, సహకరించిన వారిపై చట్టం ప్రకారం శిక్షార్హులవుతారని వరంగల్ స్పెషల్ జడ్జీ దుర్గాజీ, జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డిలు అన్నారు. శనివారం సంగారెడ్డి పోలీసు కార్యాలయంలో ఎస్పీ అధ్యక్షతన మాదకద్రవ్యాలు, కేసులు, వాటి అమలు తీరుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మొదటిగా జాతీయగీతం ఆలపించి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ నేటి సమాజం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో మాదకద్రవ్యాల వాడకం ప్రధానమైందని, యువ త డ్రగ్స్ బారిన పడి తమ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు కావున ఇలాంటి మాదకద్రవ్యాలను నియంత్రించాలంటే చట్టంపై పూర్తి అవగాహన ఏర్పరచుకోవడం ద్వారా మత్తుపదార్థాలను తయారుచేసేవారికి, సరఫరా చేసే వారికి కఠిన శిక్షలు అమలయ్యేలా చేయవచ్చునని, ఈ విధంగా యువత మత్తు పదార్థాల బారిన పడకుండా నియంత్రించవచ్చు. కావున కార్యక్రమాన్ని జిల్లా పోలీసు అధికారులు అందరూ సద్వినియోగం చేసుకొని ఎన్‌డిపీఎస్ చట్టంపై పూర్తి అవగాహన సాధించాలని ఎస్పీ సూచించారు. అనంతరం వరంగల్ అదనపు జడ్జి దుర్గాజీ మా ట్లాడుతూ ఎన్‌డిపీఎస్ చట్టం గురించి వివరిస్తూ ఎవరైనా మాదక ద్రవ్యాలను పండించినా, తయారు చేసినా లేక వాటిని పోగు చేసినా, ర వాణా చేసిన మత్తుపదార్థాలు తయారుచేసేవారికి సహకరించినా, ఆశ్ర యం కల్పించినా ఈఎన్‌డిపీఎస్ యాక్ట్-1985 ప్రకారం శిక్షార్హులనన్నా రు. ఈ అవగాహన కార్యక్రమంలో ఏవీ మత్తుపదార్థాలు, ఏవీ చట్టం పరిధిలోకి వస్తాయి, ఏ కేసు నమోదు చేయాలని, ఏఏ శిక్షలు వేయాల్సి ఉం టుందనే అంశాలపై సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో మార్గనిర్దేశకాలను అధికారులకు తెలియజేశారు. అనంతరం పోలీసు అధికారులు అడిగిన ప్రశ్నలకు వారు సమాధానం తెలిపారు. సమావేశంలో డైడైరెక్టర్ ప్రాసిక్యూషన్ శ్రీనివాస్‌రెడ్డి, డీఎస్పీలు శ్రీనివాస్‌కుమార్, సీతారాం, నల్లమల రవి, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ఉమ్మడి మెదక్ జిల్లా సీఐ, ఎస్‌ఐలు ఉన్నారు.

Comments

comments