Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

మ్యాక్స్ క్యూర్ ఆసుపత్రి సేవలు మరవలేనివి

mayar
*ప్రజలు వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
*ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకొండి
*కరీంనగర్ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్

మనతెలంగాణ/కరీంనగర్‌టౌన్: కరీంనగరంలోని 50 డివిజన్‌లలో ఉచిత వైద్య శిబిరాలకు మ్యాక్స్ క్యూర్ ఆసుపత్రి శ్రీకారం చుట్టడం మరువలేనిదని నగర మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ అన్నారు. మ ంగళవారం నగరంలోని 5వ డివిజన్ కిసాన్ నగర్‌లో మ్యాక్స్ క్యూర్ ఆసుపత్రి చే ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సంద ర్భంగా మేయర్ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడుతూ నగర ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూ చించారు.నిరుపేదలకు మ్యాక్స్ క్యూర్ నిర్వాహకులు అందిస్తున్న ఉ చిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కొన్ని నియామాలు పాటించాలన్నారు. స్మార్ట్ సిటీలో భాగంగానే నగరంలో చెత్తపై సమరం కొనసాగుతుందన్నా రు. వ్యాధులు రాకుండా బల్దియా ముందస్తు చర్యలు తీసుకుంటుం దన్నారు. ప్రజలు వ్యాధుల బారిన పడకుండా పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.ముందస్తు వ్యాధులు రాకుండా మ్యాక్స్ ఆసుపత్రి నగరంలోని అన్ని డివిజన్‌లలో దశల వారిగా ఉచితవైద్యశిబిరాలనునిర్వహించడం అభినందనీయమన్నారు. మ్యా క్స్ క్యూర్ ఆసుపత్రి ఇన్‌చార్జీ గుర్రం కిరణ్ మాట్లాడుతూ తమ ఆసు పత్రి ఆధ్వర్యంలో నగరంలోని డివిజన్‌లలో కార్పొరేటర్ల సహకారం తో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామన్నారు. ముందుకు వ చ్చి శిబిరాలకు సహకరిస్తున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి శిబి రంలో దాదాపు మూడు నుంచి నాలుగు వందల మందికి వైద్య పరీ క్షలు నిర్వహించి మందులు అందించడం జరుగుతుందన్నారు. ఇసి జి,బిపి,షుగర్ పరీక్షలతో పాటు అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్నారు.
గుండెకు సంబంధించిన పరీక్షలు ఆరోగ్యశ్రీలో చేస్తున్నట్లు వెల్ల డించారు. ఆరోగ్య శ్రీ ప్రభుత్వ ఉద్యోగులకు కా ష్‌లెస్ వైద్య సేవలు, ప్రైవేట్ ఉద్యోగులకు హెల్త్ ఇన్సూరెన్స్, ఇఎస్‌ఐ సౌకర్యం కూడా ఆ సుపత్రిలో అందుబాటులో ఉందన్నారు. మంగళ వారం నిర్వహించి న ఉచిత వైద్య శిబిరంలో 300ల మంది రోగు లకు వైద్య పరీక్షలు అందించి ఉచితంగా మందులు పంపిణీ చేశామన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్,క్యాంప్ ఇన్‌చార్జ్జి శ్రీకాంత్, కరుణాకర్, వైద్యులు డాక్టర్ సంపత్ తదితరులు పా ల్గొన్నారు.

Comments

comments