Search
Saturday 17 November 2018
  • :
  • :

ఎంబీఏ విద్యార్థిని ఆత్మహత్య

mba
హైదరాబాద్: ఎంబీఏ రెండో సంవత్పరం చదువుతున్న విద్యార్థినీ హైదరాబాద్ శివారు కొంపల్లిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. శివశివాని కాలేజీలో ఎంబీఏ చదువుతున్న హనిషా చౌదరి అనే విద్యార్థి అదే కళాశాలకు చెందిన హాస్టల్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అనంతపురం జిల్లాకు చెందిన బుగ్గయ్య చౌదరి కుమార్తెగా పోలీసులు గుర్తించారు. అయితే ఆత్మహత్యకు ముందుగా హనీషా తన ప్రేమికుడితో వీడియోకాల్ మాట్లాడింది. వీడియోకాల్‌లో అతడు చూస్తుండగానే ఫ్యాన్‌కు ఉరేసుకుంది. దీంతో అతను వెంటనే హాస్టల్ గదికి చేరుకుని లోపల గడియ పెట్టి ఉండడంతో తలుపులు బద్దలుకొట్టి ఫ్యాన్‌కు ఉరేసుకున్న హనీషాను ఆమె స్నేహితురాలి సాహయంతో ఆసుపత్రికి తీసుకేళ్లారు. ఆస్పత్రికి చేరేలోపే హనీషా మారణించింది. ఆమె మృతదేహన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దార్యాప్తు చేస్తున్నారు.

Comments

comments