Search
Monday 24 September 2018
  • :
  • :

వరంగల్‌లో ప్రీ రిలీజ్ వేడుక

MCA

నాని, సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘ఎంసిఎ’. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్, లక్ష్మణ్  నిర్మిస్తున్న చిత్రమిది. ఈ సినిమా ఈనెల 21న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఈనెల 16న వరంగల్‌లో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ “డబుల్ హ్యాట్రిక్ హీరో నాని ఈ ఏడాది ప్రారంభంలో మా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో ‘నేను లోకల్’ సినిమాతో హిట్ కొట్టాడు. ఇప్పుడు ఈ ఏడాది చివరలో ‘ఎంసిఎ’ సినిమాతో మరో హిట్‌ను సాధించబోతున్నాడు. ఈ సినిమా సక్సెస్‌తో మా బ్యానర్ ఒకే ఏడాది డబుల్ హ్యాట్రిక్ సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నాం. మంగళవారం ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయనున్నాం. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయి. వదిన, మరిదిల మధ్య అనుబంధాన్ని తెలియజేసే చిత్రంగా ‘ఎంసిఎ’ ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. నాని, సాయి పల్లవి జంటగా ఈ చిత్రంలో నటిస్తుండడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా చాలా బాగా వచ్చింది. శ్రీరామ్ వేణు సినిమాను చక్కగా డైరెక్ట్ చేశాడు. దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన పాటలను అందించాడు. ఇదివరకే విడుదలైన పాటలకు మంచి స్పందన వచ్చింది. ఈనెల 16న వరంగల్‌లో ప్రీ రిలీజ్ వేడుకను అభిమానుల సమక్షంలో గ్రాండ్‌గా నిర్వహించబోతున్నాం”అని అన్నారు.

Comments

comments