Search
Friday 21 September 2018
  • :
  • :

ఆదిలాబాద్ రిమ్స్ కు ఎంసిఐ షాక్!

MCI Team shocking report on Adilabad RIMS

ఆదిలాబాద్: మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసిఐ) ఆదిలాబాద్ రిమ్స్ కు షాక్ ఇచ్చింది. మెడికల్ కళాశాల గుర్తింపు కొనసాగించలేమని ఎంసిఐ తెలిపింది. కళాశాలకు రెగ్యూలర్ డీన్ లేరని, ఉన్న డీన్ విధులకు సక్రమంగా హాజరుకావడం లేదని ఎంసిఐ తన రిపోర్టులో పేర్కొంది. అంతేగాక ఫ్యాకల్టీ కూడా 35 శాతమే ఉన్నారని, సరైనసౌకర్యాలు లేవని, ఎస్ఐసియు, పరికరాల కొరత ఉందని ఎంసిఐ వెల్లడించింది. ఇలాంటి లోపాలతో కళాశాల గుర్తింపును కొనసాగించలేమని, మొత్తం 22 లోపాలను ఎంసిఐ బృందం ఎత్తిచూపింది. ఇప్పటికే పలు వివాదాలతో సతమతమవుతున్న రిమ్స్ కు ఎంసిఐ రిపోర్టు పెద్ద ఎదురుదెబ్బనే చెప్పాలి.

Comments

comments