Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

బజాజ్ ఎండి హఠాన్మరణం

MD of Bajaj Electricals Anant Bajaj dies at 41
ముంబయి: బజాజ్ ఎలక్ట్రికల్స్ ఎండి, ప్రముఖ వ్యాపారవేత్త అనంత్ బజాజ్(41) గుండెపోటుతో మృతి చెందారు. శుక్రవారం సాయంత్రం ఆయన హార్ట్ఎటాక్ తో మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. రెండు నెలల క్రితమే అనంత్ బజాజ్ ఎలక్ట్రికల్స్ ఎండిగా నియామకమైన విషయం తెలిసిందే. 1999లో బజాజ్ ఎలక్ట్రికల్స్‌లో అనంత్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి, అంచె అంచెలుగా ఎదగుతూ మ్యానేజింగ్ డైరెక్టర్ అయ్యారు. కాగా, అనంత్ మృతిపై పారిశ్రామికవేత్తలు విచారం వ్యక్తం చేస్తున్నారు. 41 ఏళ్ల చిన్న ప్రాయంలోనే ఆయన ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. అనంత్ మృతి బజాజ్ ఫ్యామిలీకి తీరనిలోటు అని పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు. అనంత్  బజాజ్ ఎలక్ట్రికల్స్ ఛైర్మన్ శేఖర్ బజాజ్ ఎకైక సంతానం.

Comments

comments