Home తాజా వార్తలు ‘అమితాబ్‌ సర్‌..త్వరలో మీ నిజాలు బయటపడతాయి’

‘అమితాబ్‌ సర్‌..త్వరలో మీ నిజాలు బయటపడతాయి’

amitab

ముంబయి: హాలీవుడ్ లో ప్రారంభమైన ‘మీటూ’ ఉద్యమం ఇప్పుడు బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ ఓ ఆంగ్ల మీడియాలో  ‘మీటూ’ ఉద్యమం గురించి స్పందిస్తూ.. ‘మహిళలు పని చేసే ప్రదేశాల్లో ఎలాంటి వ్యక్తి అయినా అసభ్యంగా వ్యవహరించరాదు. అలాంటి సంఘటనలు ఎదురైతే తక్షణమే సదరు నిందితుడిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. నిందితులపై న్యాయపరమైన చర్యలతో సమస్యని చక్కబెట్టాలి. మహిళలు, చిన్నారులు, అణిచివేతకు గురువుతున్న క్రమంలో పాఠశాల స్థాయి నుంచే నైతిక ప్రవర్తనపై అవగాహన కల్పించాలి. దేశంలో ఎన్నో రంగాల్లో పెద్ద ఎత్తున పని చేస్తున్న మహిళా లోకానికి భద్రతతో గల వాతావరణం కల్పించాల్సిన బాధ్యత మనపై ఉంది. వారికి దక్కాల్సిన గౌరవం, రక్షణ ఇవ్వకపోతే మన దేశంపై చెరిపేసుకోలేని మచ్చ పడుతుంది’  బిగ్ బి చెప్పుకొచ్చారు. అయితే, మీటూ ఉద్యమంపై స్పందించిన అమితాబ్ బచ్చన్‌పై ప్రముఖ సెలబ్రిటీ హెయిర్‌ స్టయిలిస్ట్‌ సప్నా భవ్నానీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. ‘ఇది అతిపెద్ద అబద్ధం. సర్‌..మీరు నటించిన ‘పింక్‌’ సినిమా వచ్చింది. వెళ్లిపోయింది. అదే విధంగా మీకున్న సామాజికవేత్త అనే బిరుదు కూడా పోతుంది. త్వరలో మీ నిజాలు బయటపడతాయి. నా ట్వీట్‌ చదివి మీరు కంగారులో చేతులు కొరుక్కుంటూ ఉంటారు’ అని ట్వీట్‌ చేశారు. దాంతో ఈ ట్వీట్‌ కాస్తా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

Me Too: Famous stylist Sapna is angry on Amitabh 

Telangana News