Home తాజా వార్తలు రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు : నాయిని

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు : నాయిని

NAINI

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్రహోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆయన మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైవేలపై మద్యం దుకాణాల నిషేధానికి కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. మైనర్లు వాహనాలు నడిపితే, వారి తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ ఇస్తామన్నారు. రోడ్డు ప్రమాదాలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ,డ్రైవింగ్ లైసెన్స్‌లను రద్దు చేస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన తరగతులు కూడా నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.