Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

మత్తుమందు చల్లి అత్యాచారం

RAPED

నిజాంపేట: వాషింగ్‌మిషిన్‌ రిపేర్ పేరుతో ఇంటికొచ్చిన ఓ మెకానిక్‌ వివాహితపై పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడి ఆగడాలు మితిమీరడంతో విసిగిపోయిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ఈ ఘటన హైదరాబాద్‌ బాచుపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.  సిఐ బాలకృష్ణారెడ్డి తెలిపిన వివరాలప ప్రకారం.. ప్రగతినగర్‌కు చెందిన ఓ గృహిణి వాషింగ్‌ మిషిన్‌ ఐదు నెలల క్రితం రిపేర్ కి వచ్చింది. ఆమె  ఇంటర్నెట్ సర్చ్  చేసి మియాపూర్‌లోని ఓ సర్వీస్‌ సెంటరును ఫోన్‌లో చేసింది. యజమానికి బదులు అతని మిత్రుడు పవన్‌తేజ్‌రెడ్డి(24) ఫోన్‌ లిప్ట్ చేసి అమెతో మాట్లాడాడు. గృహిణి ఇంటికి వెళ్లి మరమ్మతుల పేరుతో నాలుగైదు రోజులు టైంపాస్ చేసాడు. మిషిన్ బాగుచేసేందుకు అవసరమైన వస్తువులను తెప్పించాలని అమెతో చెప్పి వారం తర్వాత వచ్చాడు. ఇంట్లో ఒంటరిగా ఉందని గ్రహించిన అతడు ఆమె ముఖంపై మత్తుమందు చల్లాడు. స్పృహ కోల్పోయిన ఆమెను వివస్త్రను చేసి సెల్‌ఫోన్‌లో ఫోటోలు తీశాడు. తర్వాత ఆ ఫోటోలు చూపించి బెదిరించి పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తరవాత కూడా ఆఘాయిత్యాన్ని కొనసాగిస్తూ వస్తున్నాడు. బెదిరించి రూ.35 వేలు సైతం తీసుకున్నాడు. నెల క్రితం ఆమె నగ్న చిత్రాలను మిత్రులకు చూపించిన విషయం బాధితురాలి తెలిసింది. అప్పటికే నిందితుడి ఆగడాలతో విసిగిపోయిన ఆమె బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా అమె ఫిర్యాదు మేరకు జనవరి 19న పవన్‌తేజ్‌రెడ్డిని అరెస్టు చేసి నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరచగా అతడికి 376, 384, సాంకేతిక చట్టం 72 కింద కేసు నమోదు చేసి రిమాండ్‌ విధించారు.

Comments

comments