Home దునియా మెదక్ చర్చి మహాద్భుతం

మెదక్ చర్చి మహాద్భుతం

Medak Church
కులమతాలకు అతీతంగా మెదక్‌చర్చి ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. హైదరాబాద్‌కు 90 కిలోమీటర్ల దూరంలో ఉండి, ప్రపంచంలోనే రెండవ స్థానంలో నిలిచిన మెదక్ చర్చికి ప్రాధాన్యత ఉంది. 1914 ప్రాంతంలో మెదక్ కరువు రక్కసి వల్ల ఎంతో మంది మృతిచెంది విలవిల్లాడుతుంటే ఇంగ్లాండ్ నుంచి మత ప్రచారం కోసం మత ప్రచారకుడు చార్లెస్ వాకర్ మెదక్ ప్రాంతాన్ని చూసి చలించిపోయాడు. ఉపాధి లేక ఎందరో మృత్యువాత పడుతున్నారని మానవతాన్ని చాటుకున్నాడు. మెదక్ ప్రాంతంలో ఉపాధి హామీ పథకం చేపట్టి ప్రజల ప్రాణాలు రక్షించాలనీ సంకల్పించాడు. వెంటనే చర్చి ఏర్పాటు చేయాలని నిశ్చయించుకొని పనులు మొదలుపెట్టాడు. 1914లో మొదలైన చర్చి పనులు 1924 డిసెంబర్‌లో పూర్తి అయ్యింది. ప్రతి రోజు 12వేల మంది కార్మికులు ఉపాధి పొందారు. ముంబై ప్రాంతం నుంచి తీసుకువచ్చిన 12వేల మందికి ఇక్కడ ఉపాధిదొరికింది. 10 సంవత్సరాల పాటు మెదక్ ప్రాంతం నిత్యకళ్యాణం పచ్చతోరణంగా కొనసాగింది. కష్టజీవుల శ్రమ ఫలితంగా 175 ఎత్తు, 200 మీటర్ల పొడవు, వంద మీటర్ల వెడల్పుతో ఈ చర్చి ఏర్పడింది.

 

చర్చి నిర్మాణానికి ఇటలీ దేశం నుంచి ప్రతి గాజు ముక్కను ఓడల ద్వారా మద్రాసు నుంచి మెదక్‌కు తరలించారు. గాజుముక్కను అమర్చడానికి ఇంగ్లాండ్ నుంచి నిపుణులు సూర్యరశ్మి ఉంటేనే వెలిగేలా గాజుముక్కలను అమర్చి అబ్బురపరిచారు. చర్చిలో ప్రతిధ్వనించకుండా ఉండేవిధంగా కట్టడం ఏర్పాటు చేశారు. చార్లెస్ వాకర్ కృషి ప్రపంచ వ్యాప్తంగా వెలుగొందింది.

మూడు ద్వారాలు ఏర్పాటు చేసి ఐదువేల మంది ఒకేసారి ప్రార్థన చేసుకునే వీలుంది. ఒకవైపు క్రీస్తు జననం, శిలువ, ఏసు పునరుద్ధరణ వంటి గాజు దృశ్యాలను ఈజిప్టు నుంచి తెచ్చిన గాజుపెంకులతో ఏర్పాటుచేశారు. నిత్యం భక్తులు దేశ విదేశాల నుంచి వచ్చి క్రీస్తును దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఈ చర్చిలో భక్తుల రద్దీ పెరగడంతో మెదక్ పర్యాటక కేంద్రంగా మారింది. మాజీ భారతదేశ ప్రధాని ఇందిరాగాంధీ హయంలో మెదక్ నుంచి లోక్‌సభకు ఎన్నిక కావడంతో ఇందిరాగాంధీ చర్చిని సందర్శించి ప్రశంసించారు.

బివికె రాజుమెదక్ ప్రతినిధి

Medak Church Gurinchi in Telugu