Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

మట్టిలో మాణిక్యాలు

Medak-Students

సకల సౌకర్యాలు కల్పించినా చదువుకోవడానికి నానా తంటాలు పడుతుంటారు కొంతమంది… చదువుకోవడానికి పేదరికం అడ్డుకాదని నిరూపిస్తుంటారు మరికొందరు. బాల్యవివాహం చేసుకున్నా, ఇంటి బాధ్యతలతోపాటు చదువుకుంటూ భర్త ప్రోత్సాహంతో నీట్‌లో ర్యాంకు తెచ్చుకున్న రాజస్తాన్‌కు చెందిన రూపాయాదవ్ అందరిచేతా శభాష్ అనిపించుకుంటున్నారు. అదేవిధంగా డైట్‌సెట్‌లో ప్రథమ, తొమ్మిదో ర్యాంకులు సాధించిన మెదక్ జిల్లాకు చెందిన అక్కాచెలెళ్లు సోమ రాజేశ్వరి, పవిత్రలు అమ్మాయిలందరికీ స్ఫూర్తిగా నిలిచారు.

పేదరికం చదువుకు అడ్డం కాదని నిరూపించి పక్కాప్రణాళికతో చదివి తెలంగాణ డైట్‌సెట్‌లో రాష్ట్రస్థాయి ప్రథమ, తొమ్మిదవ ర్యాంకు సాధించారు మెదక్ జిల్లాకు చెందిన అక్కాచెల్లెళ్లు సోమ రాజేశ్వరి, పవిత్ర. పెద్దశంకరంపేటకు చెందిన సోమా శ్రీనివాస్, అంజలిల పిల్లల వీళ్లు. తండ్రి  స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తాత్కాలిక ఉపాధ్యాయుడు. తల్లి కూడా ఉద్యోగిని. ఇంటర్మీడియట్‌లో మంచి మార్కులు వచ్చినా డైట్‌సెట్ రాసి ఉపాధ్యాయురాలు కావాలనుకుంది రాజేశ్వరి. అంబేద్కర్ యూనివర్సిటీలో దూరవిద్య ద్వారా డిగ్రీ చేసింది. ఇంట్లో ఉంటూనే డైట్‌సెట్‌కు ప్రిపేర్ అయింది. ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేకపోవడం వల్ల బయట ఎక్కడా శిక్షణ పొందలేదు. రోజుకు ఐదారుగంటలు చదివారిద్దరు. ఆ పట్టుదల వారికి విజయాన్ని సాధించి పెట్టిందని చెప్పవచ్చు.

Comments

comments