Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

పతకాల పంట ఖాయం: గోపీచంద్

Gopi-chandచెన్నై: రానున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత ఆటగాళ్లు పతకాలు పంట పండించడం ఖాయమని జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్ ధీమా వ్యక్తం చేశాడు. ఈ పోటీల్లో భారత్ మంచి ప్రదర్శన ఇస్తుందనే నమ్మకం తనకుందన్నాడు. గతంతో పోల్చితే ఈసారి ఎక్కువ సంఖ్యలో పతకాలు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయన్నా డు. పివి.సింధు, సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్ లు ఈసారి కచ్చితంగా పతకాలు సాధిస్తారనే న మ్మకం తనకుందన్నాడు. ఇటీవల కాలంలో శ్రీకాంత్ పురుషుల బ్యాడ్మింటన్‌లో సంచలన ఆటగాడిగా ఎదిగిన విషయాన్ని గోపీచంద్ గుర్తు చేశా డు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో అతను మంచి ఫలితాలు సాధించడం ఖాయమన్నాడు. ఒలింపిక్ రజత పతక విజేత సింధు కూడా ఏదో ఒక పతకం గెలుచు కోవడం తథ్యమన్నాడు. ఇక, కిందటిసారి రజతం సాధించిన సైనా ఈసారి కూడా మెరుగైన ఆటను కనబరుస్తుందనే నమ్మకం తనకుందన్నా డు. ప్రపంచ పోటీల్లో భారత్ మెరుగైన ఆటగాళ్లతో బరిలోకి దిగుతుందన్నాడు. ఈ టోర్నీలో పోటీ తీవ్రంగా ఉన్నా భారత్‌కు మంచి అవకాశాలున్నాయని గోపీచంద్ అన్నాడు. బుధవారం చెన్నైలో జరిగిన బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్ (బిపిఎల్) ప్రచార కార్యక్రమంలో గోపీచంద్ పాల్గొన్నాడు.

Comments

comments