Home తాజా వార్తలు ఇద్దరు దొంగలు అరెస్ట్…

ఇద్దరు దొంగలు అరెస్ట్…

JAIL

మేడ్చల్: వరస దొంగతనాలు పాల్పడుతున్న ఇద్దరు అంతర్ రాష్ట్ర దొంగలను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఉమామహేశ్వర్ రావు, యాదమ్మలు కలిసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో దాదాపు 150 దొంగతనాలు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. నిందితుల నుంచి 30 తులాలు బంగారం, 1.4 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు.  ఈ ఘటనలో నిందుతులపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.