Search
Wednesday 21 November 2018
  • :
  • :

నాసాలో మేడ్చల్ విద్యార్థి

NASA

మన తెలంగాణ/ మేడ్చల్ : అమెరికాలోని లాస్ ఏంజిల్స్ కాలిఫోర్నియాలో జరిగిన అంతర్జాతీయ అంతరిక్ష అభివృద్ధి సదస్సుకు -మేడ్చల్ పట్టణానికి చెందిన యేర్పుల శ్రీవత్స పాల్గొన్నాడు. మేడ్చల్ పట్టణానికి చెందిన యేర్పుల హరిప్రసాద్ కుమారుడు శ్రీవత్స కొంపల్లిలోని శ్రీచైతన్య పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. మే నెల 24వ తేదీ నుంచి 27వ తేదీ వరకు లాస్ ఏంజిల్స్‌లోని కాలిఫోర్నియాలో జరిగిన నాసా సమావేశాల్లో పాల్గొని అంతరిక్షం లో ఆవాసాలు అనే ప్రాజెక్టును ప్రదర్శించినట్లు విద్యార్థి తండ్రి తెలిపారు. తమ కుమారుడిని సైంటిస్టుగా తయారు చేస్తామని ఆయన తెలిపారు.

Comments

comments