Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

ప్రశాంతంగా నీట్

Medical Entrance Exams 2018

మన తెలంగాణ /సిటీబ్యూరో
ఎంబిబిఎస్, బిడిఎస్ వైద్య విద్యలో ప్రవేశాలకు గాను ఆదివారం జరిగిన జాతీయ స్థాయి అ ర్హత పరీక్ష (నీట్ 2018) ప్రశాంతంగా ముగియగా, నిమిషం ఆలస్యం నిబంధన మాత్రం పలువురి విద్యార్థుల జీవితాలను అంధకారంలోకి నెట్టింది. సెకన్ల తేడాతో వచ్చిన విద్యార్థులను పరీక్షకు అనుమతించకపోవడంతో పలువురు విద్యార్థులు నీట్ పరీక్షకు దూరమయ్యారు.
నీట్ పరీక్షకు వచ్చినా విద్యార్థులను నిబంధనల పేరుతో పలు సెంటర్లలో అధికారులు భయభ్రాంతులకు గురి చేశారు. ఈ ఏడాది పరీక్షకు వచ్చే విద్యార్థులందరూ పొడుగు చేతులు కాకుండా పొట్టి చేతుల దుస్తువులతో మాత్రమే హాజరు కావాలని సిబిఎస్ ఈ స్పష్టం చేయడంతో దీనిని ఆసరా చేసకుని పలు సెంటర్లలో అధికారులు మరి అతి చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. పలువురు విద్యార్థులు పొడుగు చేతుల దుస్తువులను ధరించి పరీక్షకు రాగా, అధికారులు కత్తెరలతో తమ ఇష్టానుసారంగా కత్తిరించి మరి పరీక్ష కేంద్రాలకు అనుమతించారు.  మరికొన్ని చోట్ల పూర్తిగా పొడుగు చేతులు లేకపోయినా అధికారులు వాటిని కూడా కత్తిరించడంతో విద్యార్థినులు కొంత అవమానాలకు గురైయ్యారు. దీంతో ఒక దశలో  విద్యార్థులకు తోడుగా వచ్చినా తల్లిదండ్రులు పలు చోట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. చివరికి  చెవి రింగులను సైతం అధికారులు కత్తిరించి చేతుల్లో పెట్టారు. కొన్ని రకల చెవి రింగులు  తీసే వీలు లేకపోవడం వల్లె తప్పని పరిస్థితి కారణంగానే తాము పరీక్షకు వచ్చామని అధికారులు వాటిని ఇష్టానుసారంగా కత్తిరించి చేతుల్లో పెట్టడంమేమిటంటూ పలువురు విద్యార్థినులు ఆవేదన వ్యక్తంచేశారు.

Comments

comments