Search
Wednesday 19 September 2018
  • :
  • :

చేపా చేపా ఎవర్ని బతికిస్తున్నావ్..?

Fish business

చేపలు దండిగా ఉన్నా తగ్గని ధరల మోత
దళారులదే ఇష్టారాజ్యం
స్థానికులకు తప్పని ధరాఘాతం

నాగర్‌కర్నూల్ ప్రతినిధి: చెర్వునిండా నీరు, సమృద్దిగా చేపలు, చేపల ప్రియులకు నోరూరింపు, మత్సకారుల ఆదాయంపై ఆశలు.. ఇది వినడానికి అందంగా ఉన్నా అమలు అవుతున్నది మాత్రం శూన్యం. దళారుల రాజ్యం వినియోగ దారులకు ధరల మోత తప్పటం లేదు. గతంలో చేపలు కొనా
లంటే అధిక శాతం కృష్ణానది నుండి రావల్సిందే. పెద్ద చేపలు దళారులు తీసుకుపోగా సాధారణ చేపలు జనానికి దక్కేవి. చేపల్లో తాజా దనం లోపించడంతో ధరల మోతతో చేప తినే వారికి కొంత ఇబ్బందిగా ఉండేది. కెఎల్‌ఐ ప్రాజెక్టు నీరు జిల్లాలోని పలు ప్రాంతాల చెర్వుల్లోకి చేరడంతో ప్రభత్వం కొంత, స్థానిక మత్సకారులు మరికొంత చేపపిల్లలను చెర్వులోకి వదిలారు. ఏ ఏడాది తినే వారికి చేపలు తక్కువ ధరలకు లభిస్తాయని మత్సకారులకూడా ఆదాయం భారీగా ఉంటుందని ఆశించారు. తీరా చేతికి వచ్చిన చేపలు నోట్లోకి వెల్లకుండా వాటి ఆదాయం మత్సకారుల జేబుల్లోకి వెల్లకుండా దళారులు దండుకుపోతున్నారు.

74లక్షల చేపపిల్లల పెంపకం: నాగర్‌కర్నూల్ జిల్లాలో ఆరు జలాశయాలు, 132పెద్ద చెర్వులు,12వందల కుంటలున్నాయి. ఈ చెర్వుల పరిదిలో ఉన్న 140 మత్సకారుల సంఘాలలో 10వేల మందికి పైగా సభ్యులున్నారు. ఈ ఏడాది కెఎల్‌ఐ నీరు సమృద్దిగా ఉండటంతో చేపల పెంపకంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఎండిన చెర్వులతో బండబారిన బ్రతుకులు వెల్ల దీస్తున్న మత్సకారుల్లో ఆశలు చిగురించాయి. దీనికి అనుగుణంగా ప్రభుత్వం గత పర్షాకాలంలో 74లక్షల చేపపిల్లల్ని చెర్వులు, కుంటలు,జలాశయాల్లో వదిలారు. ముఖ్యంగా జిల్లాలోని కొల్లాపూర్, కోడేరు, పెద్దకొత్తపల్లి, నాగర్‌కర్నూల్, బిజినేపల్లి, తెల్కపల్లి, లింగాల, ఉప్పునుంతల ,బల్మూరు తదితర మండలాల్లో అధిక సంఖ్య లో కల్వకుర్తిలో కొద్ది చోట్ల చేపపిల్లల్ని వదిలారు. దీనికి తోడు మత్సకారులు సైతం భారీ సంఖ్యలో చేపపిల్లల్ని పెంచుకున్నారు. దీంతో ప్రతి గ్రామంలో చేపలు సంమృద్దిగాఉన్నాయి. ఈ సారి తమకు ఎలాంటి కొదవ ఉండబోదని చేపల ప్రియులు కూడా సంబర పడ్డారు.

 అయితే పరిస్థితి అందుకు పూర్తి విరుద్దంగా మారింది. చేపలు ఎన్ని ఉన్నా ధరలు మాత్రం దిగి రాలేదు. గతంలో స్థానిక మార్కెట్‌లో కిలో చేపలు వందరూపాయలకు దొరికేవి ప్రస్తుతం ఆధర రూ.140 కి పెంచారు. చేపలెన్ని పెరిగినా ధరలు మాత్రం అందుబాటులో లేకపోవడం వినియోగదారుల్లో అసంతృప్తి కల్గిస్తున్నది. నిబంధనలు ఏంచెపుతున్నాయంటే:గ్రామాల్లోని చెర్వులు, కుంటలు, ఇతర జలాశయాల్లో చేపలు పడితే ఖచ్చితంగా గ్రామస్తులకు తెలియ జేయాలి. బయటి మార్కెట్‌కన్నా గ్రామస్తులకు తక్కువ ధరలకు చేపలు అమ్మాలి. గ్రామంలో వినియేగించగల్గినంత అమ్మిన తర్వాతే బయట మార్కెట్‌లో అమ్మకాలు జరపాల్సి ఉంది. ఈ నిబంధన ఎక్కడా అమలు కావడంలేదు. చెర్వులు మావీ చేపలు మావీ అంతా మా ఇష్టం అన్నట్లు మత్సకారుల సంఘాలు వ్యవహరిస్తుండటంతో తమ గ్రామాల్లోని చేపల్ని బయటి మార్కెట్‌లో అధిక ధరకు తామే కొనుగోలు చేయాల్సిన దుస్తితి ఏర్పడింది.

Comments

comments