Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

‘వారిని నపుంసకులుగా మార్చడమే సరియైన శిక్ష’

Meera-Jasmine

గోరింటాకు, గుడుంబా శంకర్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్ మీరా జాస్మిన్ మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్న వారిపై ఘాటైన వ్యాఖ్యలతో విరుచుకుపడింది.  మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడేవారికి క్యాస్ట్రేషన్(అంగ విచ్ఛేదన) ఒక్కటే సరైన శిక్ష అని పేర్కొంది. రేపిస్టులకు కూడా బాధతో కూడిన శిక్షను విధిస్తే అత్యాచార బాధితుల బాధ ఎంటో తెలుస్తుందని అంటున్నది.

ప్రస్తుతం దేశంలో లైగింక దాడి నేరాలకు అమలవుతున్న చట్టాలు సరిపోవని.. వాటితోపాటు నిందితులకు ఇలా ప్రత్యక్ష బాధ(బీజకోశాలను తీసేసి నపుంసకులుగా మార్చడం) కలిగించే శిక్షలను అమలు చేస్తే అత్యాచార నేరాలను సమర్థంగా ఎదుర్కొనట్టు అవుతుందని మీరా జాస్మిన్ చెప్పింది. అత్యాచార బాధితురాళ్ల నేపథ్యంలో ఆమె నటించిన తాజా సినిమా ‘పాథు కల్పనకల్’ మూవీ ప్రమోషన్‌లో భాగంగా మీడియా సమావేశంలో మీరా జాస్మిన్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.

Comments

comments