Home జాతీయ వార్తలు నిర్భయ కన్నాదారుణం

నిర్భయ కన్నాదారుణం

Rape attemptes on women

దేవాలయంలోనే సాగిన ఘాతుకం
సంచార జాతులపై పైశాచికం
కథువా బాలికపై అత్యాచారం కేసు ఛార్జీషీట్‌లో వెల్లడి

జమ్మూ: ఎనిమిదేళ్ల కథువా బాలికను ఒక ఆలయంలో బందీగా ఉంచారు. మత్తుమందు ఇచ్చి పలుసార్లు అత్యాచారం జరిపారు. ఇది కథూవా బాలికపై అత్యాచార ఘటనకు సంబంధించి జ మ్మూ కశ్మీర్ పోలీసులు దాఖలు చేసిన ఛార్జీషీట్. ఈ బాలికపై పైశాచిక దాడి ఉదంతం జమ్మూ కశ్మీర్‌ను మతపరంగా మరింతగా విభేదాలలోకి నెట్టింది. సంచార జాతుల్లో ముస్లిం బకర్‌వాల్ తెగ కు చెందిన  ఎనిమిదేళ్ల బాలిక అసిఫా బానో   జనవరి 1౦వ తేదీన కథూవా జిల్లాలో ఆమె ఇంటివద్దనే ఎత్తుకు వెళ్లారు. తమ గుర్రాలను మేపుతూ ఉండగా ఆమెను దుండగులు అపహరించుకువెళ్లారు. దేవీస్థాన్ అనే ఒక పురాతన దేవాలయంలో బందీగా ఉంచారు. ఒక రిటైర్డ్ రెవిన్యూ అధికారి ఈ బాలిక అపహరణకు సూత్రధారి అని పోలీసు ఛార్జీషీట్‌లో తెలిపారు. జమ్మూ కశ్మీర్ పోలీసు క్రైంబ్రాంచ్ వారు ఈ అభియోగపత్రాన్నిపొందుపర్చారు.

సంజీరాం అనే మాజీ అధికారి ఈ ప్రాంతపు బకర్‌వాలాలలను భయపెట్టేందుకు, ఈ సంచార జాతులను కథూవా సమీపంలోని హీరానగర్ గ్రామ ప్రాంతం నుంచి తరిమికొట్టాలని వ్యూహరచనకు దిగాడు. స్కూల్ చదువు మధ్యలో ఆపేసిన తన మేనల్లుడును ఈ చర్యకు పురికొల్పినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో ఎనమండుగురుపై అభియోగాలు నమోదు అయ్యాయి. సంజీరాం, ఆయన మేనల్లుడు , సంజీరాం కుమారుడు విశాల్ జంగోతార , మేనల్లుడి స్నేహితుడొకరు, వీరితో పాటు ఒక పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్, హెడక్ కానిస్టేబుల్, ఇద్దరు ప్రత్యేక పోలీసు అధికారుల ప్రమేయం కూడా ఈ బాలిక ఉదంతంలో ఉన్నట్లు వెల్లడికావడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనానికి అంతకు మించి ఉద్రిక్తతలకు దారితీసింది. రెవెన్యూ మాజీ అధికారి మేనల్లుడిని తొలుత బాల్య దశలో ఉన్న వాడిగా పేర్కొన్నారు. అయితే తరువాతి డిఎన్‌ఎ పరీక్షలలో 19 ఏళ్లవాడిగా నిర్థారణ కావడంతో ఈ వ్యక్తి ఇప్పుడు ఈ కేసులో కీలకంగా మారాడు.

ఈ కేసులో నేరగాళ్లకు సహకరించేందుకు పోలీసులు లంచాలు పుచ్చుకున్నందున సాక్షాల నాశనానికి పాల్పడినందున వారిని నిందితులుగా చేర్చినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. సంజీరాం నిర్వహణలో ఉన్న ఒక దేవస్థానంలో బాలికను బందీగా ఉంచారు. తరువాత ఆమెకు మత్తు మందు ఇచ్చి పదేపదే మానభంగం చేసినట్లు, కొన్నిసార్లు సామూహిక మానభంగం కూడా జరిగినట్లు పోలీసు ఛార్జీషీట్‌లో తెలిపారు. ఈ బాలికను ఆ దేవాలయంలో జనవరి14 వరకూ ఉంచారు. తరువాత సంజీరాం మేనల్లుడు ఆ బాలికను గొంతు నులిమి చంపి, తరువాత బండరాయితో మోదినట్లు వెల్లడి అయినట్లు పోలీసులు తెలిపారు. ఆ తరువాత సమీపంలోని అడవులలోకి శవాన్ని తీసుకువెళ్లిపడేశారు. జన్యు పరీక్షలు, రక్తపు నమూనాలు ఇతరత్రా దొరికిన ఆధారాలు ఈ క్రూరమైన ఘటనకు ఆ దేవాలయం వేదిక అయిందని వెల్లడైందని, అన్ని ఆధారాలతో వారిని నిందితులుగా పేర్కొన్నట్లు పోలీసు శాఖ తెలిపింది.