Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

99 ఏళ్ల బామ్మ… యోగాలో ‘ఆల్ టైం రికార్డ్’

bhamma-recorf

కోయంబత్తూర్: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పలువురు ప్రముఖులు, ప్రజలు పెద్ద మొత్తంలో యోగాసనాలు వేస్తూ అందరిని అకట్టుకుంటున్నసంగతి తెలిసిందే. యోగా డే ని పురస్కరించుకొని దేశంలో ఉన్నప్రజలంతా ఈ 99 ఏళ్ళ యోగా గురువును గురించి ఖచ్చితంగా తెలుస్కోవాల్సిందే. కోయంబత్తూర్ నివాసి అయిన అమ్మనానమ్మాళ్ యోగాసనాలు వేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ యోగా టీచర్ ను అమ్మనానమ్మాళ్ ను ప్రేమగా (యోగా పాటి)అని  పిలుస్తుంటారు. శతాధిక వయస్సులోనూ ఎందరో యోగా గురువులుగా పాఠాలు చెబుతున్నారు. 99 సంవత్సరాలో కూడా ఈ బామ్మ ఎవరి సపోర్ట్ తీసుకోకుండానే నిలబడటం, నడవడం, కూర్చోవడమే కాకుండా కష్టమైన యోగాసనాలు వేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పశ్చిమోత్తనాసన, కంధరాసన, శీర్షాసనంతోపాటు ఇతర యోగాసనాలు చాలా అవలీలగా వేయడం ఈ బామ్మ స్టైల్. అమ్మనానమ్మాల్ దాదాపు 50కి పైగా యోగాసనాలలో నిష్ణాతులని ఆమె దగ్గర శిక్షణ పొందిన వారు చెబుతున్నారు. అమ్మనానమ్మాళ్ 2017లో రాష్ట్రపతి చేతుల మీదగా నారీ శక్తి అవార్డ్ ను కూడా అందుకున్నారు.

ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన ప్రత్యేక విందులో అమ్మనానమ్మాళ్ పాల్గొన్నారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీకి యోగాసనాలకు సంబంధించిన డెమో అందించారు. కర్నాటక ప్రభుత్వం నుంచి యోగా రత్న అవార్డులను అందుకున్న ఘనత ఆమె సొంతం. ఈ యోగా టీచర్ కొడుకు బాలకృష్ణన్ (ఓజోన్ యోగా) పేరుతో యోగా శిక్షణ కేంద్రాన్నినడుపుతున్నారు. ఇప్పటి వరకు 10 లక్షల మంది విద్యార్థులకు యోగాసనాల్లో శిక్షణ ఇచ్చినట్టు బాలకృష్ణన్ తెలిపారు. అందులోంచి 10 వేల మంది యోగా శిక్షకులుగా పనిచేయడం గమనార్హం.  అమ్మనానమ్మాళ్ దగ్గర శిక్షణ పొందిన విద్యార్థులు చైనా, థాయ్ లాండ్, మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా, యుకె వంటి ప్రపంచ దేశాల్లో యోగా పోటీల్లో పాల్గొని ఎన్నో అవార్డులను  గెలుపొందిన ఘనత అమ్మనానమ్మాళ్ సొంతం.

bhamma

Comments

comments