Home వరంగల్ రూరల్ సంక్షేమ పథకాలే సర్పంచులను గెలిపిస్తుంది

సంక్షేమ పథకాలే సర్పంచులను గెలిపిస్తుంది

Meeting of TRS mandals is a wide range of key functionarie

మనతెలంగాణ/ఎల్కతుర్తి: గ్రామాల్లో టిఆర్‌ఎస్ బలం గా ఉందని, రాబోవు సర్పంచ్ ఎన్నికల్లో అన్ని గ్రామా ల్లో  క్లీన్‌స్వీచ్ చేయాలని హుస్నాబాద్ ఎమ్మల్యే వొడితె ల సతీష్‌కుమార్ సూచించారు. టీఆర్‌ఎస్ మండల విస్తృత స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం మండల పార్టీ అధ్యక్షుడు పోరెడ్డి రవీందర్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సతీష్‌కుమార్ హాజరై మాట్లాడుతూ సంక్షేమ పథకాలు పొ ందిన కార్యకర్తలు ప్రజలను చైతన్యం చేసేందుకు విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పారు. ప్రచారం చేయాల్సిన బాధ్యత కార్యకర్తలపైనే ఉందన్నారు. ముఖ్యంగా గ్రామాల్లో నల్లాలు, మంచినీటి బావులు, ట్యాంకులు ఉ న్నప్పటికీ రోడ్లను చెడగొట్టుకుంటూ ఎందుకు మిషన్ భగీరథ నీళ్లు తెస్తున్నారని అడిగితే ప్రజల ఆరోగ్యాలను పరిరక్షించే బాధ్యత తమ పార్టీపై ఉందని, అందుకే ప్ర జలకు స్వచ్ఛమైన నీళ్లు తాగించేందుకు మిషన్ భగీరథ వస్తోందని చెప్పాలన్నారు. అంతేగాకుండా డబుల్‌బెడ్ రూము ఇళ్లు ఎక్కడని అడిగితే గత ప్రభుత్వాలు ఎలా ఇచ్చాయో చెబుతూ రూ. 5లక్షల 4వేలతో ప్రభుత్వ స్థ లం ఇస్తూ, ఇండ్లు కట్టిస్తుంటే కాస్త ఆలస్యం కావడం సహజమని, ఇప్పటికే గ్రామాల్లో డబుల్‌బెడ్‌రూము ఇ ళ్లు మంజూరయ్యాయని, వాటిని త్వరితగతిన పూర్తి చే సేందుకు టెండర్లు సైతం పిలిచామని చెప్పారు. రైతుకు మద్దతు ధర కల్పించాలని గోల చేస్తున్నారని, ఇందు కోసమే రైతు సమన్వయ సమితిలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందులో రైతులకు మద్దతు ధర కల్పించేందుకు రైతులు పండించిన ధాన్యాన్ని నేరుగా రైతు సమితిలు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోనున్నామన్నారు.

ఈ నాలుగేళ్ల కాలంలో నియోజకవర్గ వ్యాప్త ంగా రూ. 4.30కోట్లతో బోర్లు వేయించామన్నారు. ఎ దుటి పార్టీకి కించెత్తు అవకాశం కూడా ఇవ్వకూడదని సూచించారు. నియోజకవర్గాన్ని ఇంత పెద్ద ఎత్తున ఇ ప్పటి వరకు ఎవరూ అభివృద్ధి చేయలేదని, తనకు నా యకులు సమస్యలు చెప్పడం, తాను మంత్రులు, సీఎం దృష్టికి తీసుకెళ్లి వాటిని సాధించుకోవడం ఈ నాలుగేళ్ల పాటు సాగిందన్నారు. ప్రజలకు సేవ చేస్తున్నామని, ఎ ట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేసేది లేదని స్పష్టం చే శారు. గ్రామాల్లో పేరున్న ఒక్క వ్యక్తిని మాత్రమే ఎం పిక చేసుకుని అతన్ని సర్పంచ్‌గా గెలిపించే బాధ్యత నా యకులు, కార్యకర్తలదే అన్నారు. ఈ సందర్భంగా చిం తలపల్లి, బావుపేట్ గ్రామాల నుంచి కొంత మంది ఇ తర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వారందరినీ పార్టీ కండువాలు క ప్పి పార్టీలోకి ఎమ్మెల్యే సాదరంగా ఆహ్వానించారు. ఇ ందులో సీనియర్ నాయకులు డాక్టర్ పేర్యాల రవీందర్‌రావు, ఎంపీపీ శాలిని, సర్పంచుల ఫోరం మండల అ ధ్యక్షురాలు  మాధవిమహేందర్, మాజీ మండల అధ్యక్షులు ఎల్తూరి స్వామి, బుర్ర సంపత్‌గౌడ్, జిల్లా నాయకులు శ్రీపతి రవీందర్‌గౌడ్, తంగెడ నగేష్, సమన్వయ సమితి మండల కన్వీనర్ బచ్చు కిషన్‌రావు, యాదవ్, మాజీ ఎంపీపీ కోమల తదితరులు పాల్గొన్నారు.