Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

ఎమ్మెల్యే-మంత్రుల మాటకు విలువ లేదా?

మరుగు దొడ్ల బిల్లులు ఇంకెప్పుడిస్తరు..?
అధికారుల తీరుపై సభ్యుల అసహనం

Untitled-2సంగారెడ్డి : నెలన్నరలో మరుగుదొడ్లకు సంబంధించిన బిల్లులు చెల్ల్లిస్తామని చెప్పి ఇంకా అధికారులు ఎక్కడ కూడా ఒక్క బిల్లు చెల్లించ లేదని ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్పినా ఇంత నిర్లక్షమా? అని జట్పీటిసి సభ్యులు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధుల మాటకు విలువ లేదా? అని ప్రశ్నించారు. తక్కువగా కోడ్ చేసి పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేదిలేదని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అధికారులకు సూచించారు. ఇంకా పనులు ప్రారంభించని పనులకు సంబంధించి వచ్చే నెలతో గడువు పూర్తవుతుంది కాబట్టి ఆ పనులను రద్ద్దు చేసి ఇతర కాంట్రాక్టర్లకు ఇవ్వాలని అధికారులకు సూచించారు. శనివారం జడ్పీ సమావేశ మందిరంలో జడ్పీ ఛైర్‌పర్సన్ రాజమణి మురళీయాదవ్ అధ్యక్షతన 7, 1వ స్థాయీ సంఘ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సాధారణ సమావేశంలో మరుగుదొడ్ల నిర్మాణంకు సంబంధించి బిల్లుల చెల్లింపులో అధికారుల అలసత్వం గురించి ఎమ్మెల్యే మిమ్మల్ని జైలుకు పంపినా తప్పులేదన్నప్పటికీ మీలో మార్పు రాకపోతే ఏంటని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నలభైఐదు రోజుల్లో బిల్లులు చెల్లిస్తామని జడ్పీ సాధారణ సమావేశంలో చెప్పి ఇప్పటివరకు చెప్పిన గడువు పూర్తయినా పట్టించుకోవడంలేదన్నారు.

అధికారుల్లో సమన్వయం లేకపోవడంతో ఈ సమస్యలు తలెత్తుతు న్నాయని సభ్యులు అన్నారు. ఇదిలా ఉంటే సంగారెడ్డి నియోజక వర్గంలో కొన్ని పనులకు కాంట్రాక్టర్లు తక్కువకు టెండర్లు వేసి పనులను నాణ్యత లేకుండా చేస్తున్నారని, అసలు కొందరు ఇంకా పనులను ప్రారంభించలేదన్నారు. వారిని తొలగించి, ఆయా పనులను ఇతరులకు ఇవ్వాలని అధికారులకు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తెలిపారు. నాణ్యతా లోపిస్తే అధికారులదే భాద్యత అన్నారు. ఇండ్ల మీది నుంచి వెళ్తున్న కరెంట్ వైర్లపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే అన్నారు.ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద కంచె వేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు.కాగా పిఆర్ ఎఇ మాట్లాడుతూ పై అధికారుల ఆదేశాల మేరకు అడ్వాన్స్‌గా పనులు చేపిస్తే ఇప్పటి వరకు బిల్లులు ఇవ్వడంలేదని, వెంటనే సభ్యులు ఆ డబ్బులు ఇప్పించాలని కోరారు. కాగా అసలే జడ్పీలో నిధులులేక ఇబ్బందులు పడుతుంటే సీనరేజ్ డబ్బులు ఎందుకు వసూలు చేయడంలేదని, వెంటనే సీనరేజ్ డబ్బులు వసూలు చేయాలని శ్రీకాంత్‌గౌడ్ అధికారులను కోరారు. పని చేస్తున్నా జీతాలు రాక ఉద్యోగం మానివేస్తామని ఫీల్డ్ అసిస్టెంట్లు అంటున్నారని, ఇదే జరిగితే కొత్తగా ఈ ఉద్యోగంలోకి ఎవరు వచ్చే పరిస్థితి ఉండదని, కూలీలకు ఇబ్బందులు తప్పవని, దీన్ని నివారించాలని జడ్‌పిటిసి సభ్యుడు అంజయ్య కోరారు.జడ్‌పిటిసి సభ్యుడు మనోహర్‌గౌడ్ మాట్లాడుతూ సంగారెడ్డి మండలంలో వాటర్ గ్రిడ్ కింద పనిచేస్తున్న కాంట్రాక్టర్లు నాసిరకంగా పని చేస్తున్నారన్నారు.స్రవంతి అరవింద్‌రెడ్డి, కొక్కొండ రూప, చిట్టి మాదురి,కుంచాల ప్రభాకర్ పాల్గొన్నారు.

Comments

comments