Search
Friday 16 November 2018
  • :
  • :

ఇక నుంచి 45 రోజులకు ఓసారి పాలకమండలి సమావేశం

 ఈసారి సమావేశం గుండాల మండలంలో
 కలెక్టర్ లోకేష్ కుమార్

kmm1భద్రాచలం: మూడు మాసాలకోసారి జర గాల్సిన పాలకమండలి సమావేశం ఇక నుంచి 45 రోజులకు ఓసారి నిర్వహి స్తామని, క్రమం తప్పకుండా పాలక మండలి జరిగేలా చూస్తామని జిల్లా కలెక్టర్ డిఎస్ లోకేష్ కుమార్ తెలిపారు. సోమవారం భద్రాచలం ఐటిడిఏ ప్రాంగణంలో గల ఆది వాసీ భవన్‌లో పాలకమండలి సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. జెడ్పి చైర్‌పర్సన్ గడపల్లి కవిత, ఐటిడిఏ ఇంచార్జ్ పిఓ కాళీచరణ్, ఎమ్మెల్యేలు సున్నం రాజ య్య, తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంక టేశ్వర్లు, బానోత్ మదన్‌లాల్, కోరం కన కయ్య, జెడ్పి వైస్ చైర్మన్ వాసుదేవరావు, ఐటిడిఏ పరిధిలోని గల 24 మండలాలకు చెందిన ఎంపిపి, జెడ్పిటిసి, జిల్లా అధికారులు, ఐటిడిఏ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 15 నెలలుగా ఐటిడిఏ పాలక మండలి సమావేశం నిర్వహించక పోతే గిరి జన అభివృద్ధికి ఎలా సాధ్యమవుతుందని ప్రజా ప్రతినిధులు కలెక్టర్‌కు వివరించారు. ఇకనుంచైనా క్రమ తప్పకుండా సమావేశాలు ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో స్పందించిన కలెక్టర్ మాట్లాడుతూ మూడు నెలలకు ఓ సారి పాలకమండలి జరగాల్సి ఉంది. కానీ ఇక నుంచి ప్రతీ 45 రోజులకు ఓసారి ఐటిడిఏ పాలక మండలి నిర్వహించి గిరిజనుల సమస్యలపై సమీక్షిస్తామని తెలిపారు. ఇందుకు ఆర్‌అండ్‌బి శాఖామంత్రి సైతం సుముఖంగా ఉన్నారని తెలిపారు. ఈసమావేశం గుండాల్లో ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ కోన్ని కారణాల వల్ల భద్రాచలంలో నిర్వహిస్తున్నామని, ఈ సారి జరిగే సమావేశం గుండాల్లోనే జరుగుతుందని, ఆ పాలక మండలి సమావేశానికి మంత్రి తుమ్మల హాజరుకానున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఇంజనీరింగ్, గిరిజన విద్య, ఐఏపి, ఆర్‌ఓఎఫ్‌ఆర్, ఎన్‌ఆర్ ఇజిఎస్ వంటి నాలుగు అంశాలపై ఏజెండాగా చేర్చినట్లు చెప్పారు. ఐటిడిఏలోని 16 విభాగాలకు చెందిన సమస్యలను కూలంకుశంగాచర్చించడం సాధ్యం కానందున నాలుగు అంశాలనే ఎన్నుకోవడం జరిగిందని, వచ్చే సమావేశంలో మిగతా వాటిపై చర్చింద్దామన్నారు, మోదటిగా ఇంజనీరింగ్ విభాగానికి చెందిన చర్చ సాగింది. ట్రైబల్ వెల్ఫేర్ ఇఇ శంకర్ ఇంజనీరింగ్ విభాగం ద్వారా చేపట్టిన పనులను వివరించారు. అనంతరం గిరిజన విద్యావిభాగంపై జరిగింది. డిడి సరస్వతి మాట్లాడుతూ ప్రగతిని వివరించారు. అనంతరం అటవీహక్కుల చట్టం, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంపై సుదీర్ఘ చర్చ సాగింది. అనంతరం జెడ్పి చైర్ పర్సన్ కవిత మాట్లాడుతూ గిరిజనులకు మెరుగైన విద్యా, వైద్యం అందేలా అధికారుల చూడాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా అటవీ సంరక్షణ అధికారి ఆనంద్ మోహన్, జెడ్పి సిఇఓ నగేష్, ఆర్డిఓలు అంజయ్య,రవీంధ్రనాద్, మురళీధర్, శ్రీనివాస్, జగత్ కుమార్, డిఎంఓ రాంబాబు, ఏడిఎంహెచ్‌ఓ పుల్లయ్య, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments