Home జాతీయ వార్తలు ‘ పోలవరం ’పై భేటీ

‘ పోలవరం ’పై భేటీ

nitin

ఢిల్లీ : కేంద్ర జలవనరుల శాఖ కార్యాలయంలో పోలవరం ప్రాజెక్టుపై మంగళవారం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో నవయుగ, ట్రాన్స్ ట్రాయ్ ప్రతినిధులు పాల్గొన్నారు. స్పిల్ వే, స్పిల్ ఛానల్ పనులను నవయుగ కంపెనీకి అప్పగించేందుకు నితిన్ గడ్కరీ అంగీకారం తెలిపారు. ఒప్పందంతో పాటు ప్రాజెక్టుకు సంబంధించిన పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని నితిన్ ఆదేశించారు. 2019 నాటికి పోలవరం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం చిత్తశుద్ధితో సహకరిస్తుందని మంత్రి వెల్లడించారు.

Meeting on  ‘Polavaram’ Project in Delhi