Home మంచిర్యాల రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు

meet

మంచిర్యాలప్రతినిధి: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు సంయుక్తంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ కర్ణన్ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా ఏర్పాటైన రోజు నుండి జిల్లాలో రహదారులపై రద్దీ పెరిగిందని ముఖ్యంగా జిల్లా కేంద్రాలన్నీంటికి నిత్యం ప్రజలు వివిధ వాహనాల్లో అత్యధిక సంఖ్యలో వస్తున్నారని ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాలు కూడా పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు ప్రమాదాలకు గురి కాకుండా రవాణ, పోలీసు, ఆర్‌అండ్‌బి, పంచాయతీరాజ్ శాఖల అధికారులు రోడ్డు భద్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అవసరమైన ప్రాంతాల్లో రహదారుల వెంట పెద్ద సైజుల్లో రోడ్డు నిబంధనల సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని, అవసరమైన చోట స్వీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయాలన్నారు.

జిల్లా కేంద్రం గుండా వెళ్లే భారీ వాహనాలు సాధారణ ట్రాఫిక్‌కు ఇబ్బం దులు కలుగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలకు రోడ్డు భద్రత, నిబంధనలపై అవగాహన కల్పించాలని అన్నారు. హెల్మెట్ ధరించని ద్విచక్రవాహనదారులకు పెట్రోల్ పోయరాదని, వాహనదారులు నిర్ధేశిత వేగం మించకుండా వాహనం నడిపేలా చూడాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కువ ప్రమాదా లు జరిగే ప్రాంతాలను ప్రత్యేకంగా గుర్తించి 108 వాహనాలను రహ దారులకు దగ్గరలో అందుబాటులో ఉంచాలన్నారు. ప్రమాదంవ జరి గినప్పుడు వైద్య అధికారులు వెంటనే స్పందించి సరైన వైద్యం అందిం చాల న్నారు.

ఆర్టిసి వాహనాలకు ఇబ్బంది కలుగకుండా అవసరమైన చోటు విద్యుత్ స్తంభాలను పక్కకు మార్చాలన్నారు. ఈ కార్యక్రమంలో డిసిపి జాన్‌వెస్లీ జాయింట్ కలెక్టర్ జె. సుధాకర్‌రావు, జిల్లా రవా ణాశా ఖాధికారి కృష్ణయ్య, ఆర్టిసి డిఎం మాధవరెడ్డి, డిఎంఅండ్ హె డ్‌ఓ, డాక్టర్ భీష్మా, పంచాయతీ రాజ్ ఇఇ కేవవరావు, నేషనల్ హైవే ఇఇ రాధాకృష్ణా, డిఇఓ రవికాంత్‌రావు, ఆర్‌అండ్‌బి అధికారులు, 108 రాష్ట్ర అపరేషన్ హెడ్ బ్రహ్మనందరావు, అధికారులు పాల్గొన్నారు.