Search
Wednesday 14 November 2018
  • :
  • :

నేడు నగరానికి కమల దళపతి

Meeting with Chief Ministers on strengthening the party

5వేల బైకులతో భారీ ర్యాలీ
పార్టీ బలోపేతంపై ముఖ్యనేతలతో సమావేశ

మన తెలంగాణ/సిటీబ్యూరో : అమిత్‌షా నేడు నగరానికి రానున్నారు. ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌కు చేరుకోనున్న అమిత్‌షాకు బేగంపేట ఎయిర్ పోర్ట్‌లో బీజేపీ నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలకనున్నారు. దీనికోసం ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేశారు. ఎయిర్‌పోర్ట్‌లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి షా ప్రసంగించనున్నారు. ఆతరువాత అక్కడి నుంచి నేరుగా పార్టీ ఆఫీస్‌కు వెళ్లి ముఖ్య నేతలతో భేటీ అవుతారు. బేగంపేట్ నుంచి పార్టీ ఆఫీస్‌కు వెళ్లే క్రమంలో సుమారు 5000 ద్విచక్ర వాహనాలతో ర్యాలీగా ఆయన వెంట నేతలు, కార్యకర్తలు పాల్గొనేలా నాయకులు ఏర్పాట్లు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి కార్యకర్తలు ద్విచక్ర వాహనాలపై ర్యాలీగా ఏర్పడి జాతీయ అధ్యక్షుడికి స్వాగతం పలకాలని నియోజకవర్గ నేతలకు ఆదేశాలు జారీ చేశారు. కాగా 2019 ఎన్నికలకు రాష్ట్ర క్యాడర్‌ను సమాయత్తం చేయడంలో భాగంగానే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశంగా బీజేపీ నాయకులు పేర్కొంటున్నారు. ముఖ్య నేతలతో పాటు పార్టీ కోర్‌కమిటీ సమావేశాల్లో అమిత్‌షా పాల్గొంటారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని చెబుతూ కేంద్ర పథకాలను అస్త్రాలుగా చేసుకొని ప్రధాన పార్టీల వైఫల్యాలను ఎండగట్టాలని నాయకులను దిశానిర్దేశం చేయనున్నట్లు పార్టీ వర్గాలు పేరొంటున్నాయి. అలాగే నగరంలో పార్టీని మరింత బలోపేతం చేస్తూ బూతుస్థాయి కమిటీలు, డివిజన్ కమిటీలు ఏర్పాటు చేసి క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలపై పోరాడే విధంగా నాయకులకు సంసిద్ధం చేయనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.లక్ష్మణ్ చేపట్టిన యాత్రపై కూడా కోర్‌కమిటీలో అంశం చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ఎలాంటి వ్యూహాలు అములుచేయాలనే అంశాలపై ముఖ్యంగా నాయకులు చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలో ముఖ్యనేతలతో సమావేశం అయిన తరువాత పత్రిక, టీవీ ఛానల్స్ అధినేతలతో మరో సమావేశం ఉంటుందని సమాచారం. రాత్రి ఏడు గంటల ప్రాంతంలో తిరిగి ఢిల్లీకి అమిత్‌షా వెళ్లనున్నారు.

Comments

comments