Search
Saturday 22 September 2018
  • :
  • :

19న మెగా జాబ్ మేళా

Mega Job Mela on July19th at Kolhapur

నాగర్ కర్నూల్ : కొల్లాపూర్ పట్టణంలో ఈనెల 19న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. జాబ్ మేళా నిర్వహణపై విఒఎలకు మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఈ జాబ్ మేళాలో వందకు పైగా కంపెనీలు పాల్గొంటాయని ఆయన చెప్పారు. రెండు వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత కలిగి ఉన్న వారు ఈ జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. త్వరలో గద్వాల, నాగర్‌కర్నూల్‌లలోనూ జాబ్ మేళాలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. విఆర్‌ఒ, గ్రూప్-4 ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణ తరగతులను మంత్రి ప్రారంభించారు. ఈ ఉచిత శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. లక్ష ఉద్యోగాలను కల్పించాలన్న ధ్యేయంతో తెలంగాణ సర్కార్ ఉందని జూపల్లి వెల్లడించారు.

Mega Job Mela on July19th at Kolhapur

Comments

comments