Home రాజన్న సిరిసిల్ల సిరిసిల్ల సుందరీకరణకు మెగా ప్రాజెక్టు

సిరిసిల్ల సుందరీకరణకు మెగా ప్రాజెక్టు

జెసి యాస్మిన్ భాషా

She

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రమైన సిరిసిల్లలో పట్టణ సుందరీకరణకు మెగా ప్రణాళికను తయారు చేసి చర్యలు తీసుకుంటున్నామని జిల్లా జాయింట్ కలెక్టర్ యాస్మిన్ భాషా వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పడి వంద రోజులు పూర్తయిన సం దర్భంగా ఆమె మాట్లాడారు. సిరిసిల్ల పట్టణంలో పార్కుల అభివృద్ధికి హైద రాబాద్ నుంచి కన్సల్టెంట్లను పిలిపించి సుందరీకరణ పనులను త్వరలో ప్రారం భిస్తామన్నారు. పట్టణంలో ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటుకు ప్రణాళికలను సిద్దం చేశా మన్నారు. రోడ్ల విస్తరణకు సర్వే పూర్తయిందన్నారు. జిల్లాకు ముఖ విలువను కల్పి ంచే సిరిసిల్ల పట్టణాన్ని ఆదర్శంగా నిలపడం కోసం సిరిసిల్ల పట్టణంలో పట్టణంతో పాటు జిల్లా వ్యాప్తంగా బహిరంగ మలమూత్ర విసర్జన లేని ఏర్పాట్లు చేయడానికి కృషి చేశామని అందులో పూర్తి స్థాయిలో విజయవంతం అయ్యామన్నారు. పట్టణం లో సుమారు 4800 మరుగుదొడ్లు లేని ఇండ్లను గుర్తించామని అందులో 2200 ఇండ్లల్లో మరుగుదొడ్లు పూర్తి చేయించామని మరో 2300 ఇండ్లలో పనులు నడుస్తు న్నాయని, మిగిలిన ఇండ్లల్లో ఈ వారంలో పూర్తి స్థాయిలో పనులు పూర్తవుతాయని వివరించారు.

ఇండ్లల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రజల నుంచి పూర్తిస్థాయిలో స హకారం లభించడం విశేషమన్నారు. పవర్‌లూం కార్మికులకు ఆర్వీఎం నుంచి మాత్రమే కాకుండా ఇతర శాఖల నుంచి ఏడాది పాటు పనులు ఇప్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటికే వైద్యశాలల్లో వాడే బెడ్‌షీట్లను తయారు చేసి అందించే పథకానికి ఆర్డర్లు పొందామన్నారు. అంగన్‌వాడీలు ధరించే చీరలను కూడా సరఫ రా చేసే ఆర్డర్‌ను పొందేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. టెక్స్‌టైల్ పార్కులో పూర్తి స్థాయి వసతులు కల్పించే కృషి జరుగుతుందన్నారు. ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ పా ర్కును ఏర్పాటు చేయడానికి మంత్రి కెటిఆర్ కృషి చేస్తున్నారన్నారు. మధ్యమా నేరు ప్రాజెక్ట్ భూ నిర్వాసితులకు సంబంధించిన జఠిలమైన సమస్యలను పరి ష్కరిస్తున్నామని 34.06 కోట్ల రూపాయల బకాయిలు వారికి చెల్లించాల్సి ఉండగా 17 కోట్ల రూపాయలు ఇప్పటికే మంజూరయ్యాయని మిగిలిన డబ్బు కూడా త్వరగా అందుతుందన్నారు. ముంపు గ్రాఆలకు చెందిన సమస్యల న్నింటిని ప్రణాళికాబద్దంగా పరిష్కరించే కృషి చేస్తున్నామన్నారు.

ప్రాజెక్ట్ పరిధిలోని గ్రామాల పరిహారం కోసం ముగ్గురు ఎస్‌డిసిలు, సిబ్బంది ఉం డడం వల్ల సమస్యలు ఎదురవుతున్నాయని వారందరిని ఒకే అధికారి పరిధిలోకి తెచ్చే కృషి జరుగుతుందన్నారు. ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కార్యాలయం కోసం 28 ఎకరాల స్థలాన్ని సర్వే చేసి ప్రభుత్వానికి పంపించామన్నారు. ఏడాది కాలం లోగా కలెక్టర్ కార్యాల యం నిర్మాణం పూర్తవుతుందన్నారు. రైల్వే లైన్ నిర్మాణంలో రైతు లకు తక్కువ నష్టం జరిగేలా చూస్తున్నామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 31 వేల ఎకరాల స్థలాన్ని పట్టాలుగా ఇచ్చామని అందులో ఎంత వరకు సద్వినియోగం అవుతుందో పరిశీలిస్తున్నామన్నారు. హార్టిక ల్చర్ ను ప్రోత్సహించేందుకు మండలానికి పది మంది రైతులను ఎంపిక చేసి
శిక్షణనిస్తున్నామన్నారు. వైద్యశాలలను,

అంగన్‌వాడీ కేంద్రాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసేలా కృషి చేస్తున్నా మన్నారు. ఐసిడిఎస్, హాస్పిటల్స్ మీద కోట్లాది రూపాయలు ప్రభుత్వం వ్యయం చేస్తుందని అయితే ఆశించినస్థాయిలో ఫలితాలు రావడం లేదన్నారు. మహిళల ప్రసవాలు సాధారణంగా జరిగేలా డాక్టర్లు కృషి చేసేందుకు ప్రయత్నిస్తున్నామ న్నారు. దేశవ్యాప్తంగా ఎక్కడా జరగనన్నీ సిజేరియన్ ప్రసవాలు సిరిసిల్లలో జరు గుతున్నాయని ఇది బాధాకరమన్నారు. ముహుర్తాలు చూసుకుని సిజేరియన్ ఆప రేషన్లు చేయడం మూఢనమ్మకాలకు నిదర్శనమన్నారు. దేశంలో గొప్ప వాళ్లంద రూ ముహుర్తాలు చూసుకుని పుట్టిన వారు కాదని అవగాహన పెంచుకోవాల న్నారు.

ఉన్నతాధికారులు కూడా అవినీతికి పాల్పడి ఏసిబికి చిక్కడం సిగ్గుప డా ల్సిన విషయం అన్నారు. ఇప్పటికైనా దీన్ని గుణపాఠంగా తీసుకుని ఎవరూ అవినీతికి పాల్పడరాదని సూచించారు. గతంలో మెదక్ జిల్లాలో అవినీతి నిరోధం కోసం టోల్ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేశామని అదేవి ధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా టోల్ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేస్తామని అటెండర్ నుండి అధికారి వరకు ఎవరూ లంచం అడిగినా టోల్ ఫ్రీ నెంబర్‌కు సమాచారమిస్తే తగిన చర్యలు తీసుకుంటా మన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు మంచిగా ఇస్తున్నారని అలాంటపుడు అవినీతికి దూరంగా ఉండాలని సూచించారు. రేషన్ షాపు ల తనిఖీకి ఆర్డీఓ, తహసీల్దార్లకు ఆదేశాలిచ్చామన్నారు. తూనికలు, కొలతల్లో తేడాలను గుర్తించేందుకు స ంబంధిత శాఖకు ఆదేశాలు జారీ చేశామ న్నా రు. జిల్లా వ్యాప్తంగా అభివృద్ధి చర్యలు తీసుకోవడానికి, మొక్కల పెం పకానికి ప్రాధాన్యత నిస్తున్నామన్నారు.