Home స్పెషల్ ఆర్టికల్స్ ‘గుంటూరోడు’కు మెగాస్టార్ వాయిస్ ఓవర్

‘గుంటూరోడు’కు మెగాస్టార్ వాయిస్ ఓవర్

Chiranjeevi

క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మంచు మనోజ్ హీరోగా ఎస్.కె.సత్య దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘గుంటూరోడు’. మార్చి 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానున్న ఈ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ అందించడం విశేషం. ఈ చిత్రంలో కథ, పాత్రల పరిచయ సన్నివేశాలకు చిరంజీవి తనదైన స్టైల్‌లో వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగిందని దర్శకుడు ఎస్.కె.సత్య తెలియజేశారు. మంచు మనోజ్ మాట్లాడుతూ “మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇవ్వడం సినిమాకే హైలైట్. మాస్ ఎంటర్‌టైనర్‌గా సినిమా ఘన విజయం సాధిస్తుందన్న నమ్మకముంది”అని చెప్పారు. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా చేస్తున్న ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, కోట శ్రీనివాసరావు, రావు రమేష్, సంపత్, పృథ్వీ, ప్రవీణ్, సత్య, జెమినీ సురేష్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతంః శ్రీవసంత్, సినిమాటోగ్రఫీః సిద్ధార్థ రామస్వామి, ఎడిటర్‌ః కార్తీక్ శ్రీనివాస్.