Home తాజా వార్తలు ‘సైరా’లో అమితాబ్…(టీజర్)

‘సైరా’లో అమితాబ్…(టీజర్)

Megastar Amitabh Bachchan Motion Teaser Released

హైదారబాద్: మెగాస్టార్ చిరంజీవి కథనాయకుడిగా భారీ బడ్జెట్‌తో  ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా.. నరసింహారెడ్డి’. చిరు బ‌ర్త్‌డే కానుకగా ఆగస్టు 22న విడుదల చేసిన ఈ మూవీ టీజర్ తో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ పుట్టిన రోజు సందర్భంగా కొద్దిసేపటి క్రితం ఆయనకు సంబంధించిన మోషన్ టీజ‌ర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. బిగ్ బిని ఇంతకుమునుపెన్నడు చూడని విధంగా చాలా ఫ్రెష్ లుక్ లో చూపించారు. విశ్వకవి రవింద్రనాథ్ ఠాగూర్ ను పొలిన లుక్ లో అమితాబ్ అదరగొట్టారు. ఇక బ్రిటిష్ వారితో పోరాడిన స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తీస్తున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. చిరంజీవి 151వ చిత్రంగా తెరకెక్కుతున్న ‘సైరా’పై భారీ అంచనాలు ఉన్నాయి. చిరు తనయుడు రాంచరణ్ మూవీని భారీ బడ్జెట్‌తో ప్ర‌తిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో టాలీవుడ్ తోపాటు బాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్ స్టార్లు నటిస్తున్నారు. విజయ్ సేతుపతి, సుదీప్, న‌య‌న‌తార‌, జగపతిబాబు లాంటి స్టార్లు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే మెగా డాటర్ నిహారిక కూడా ఒక ముఖ్య పాత్ర‌లో క‌నిపించ‌నుందని సమాచారం. బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది స్వరాలు అందిస్తున్న ‘సైరా’ మూవీ వచ్చే 2019లో విడుదల కానుంది.

Megastar Amitabh Bachchan Motion Teaser Released.