Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

మెగాస్టార్‌కు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ

Megastar Chiranjeevi 63rd Birthday Celebrations

మెగాస్టార్ చిరంజీవి 63వ పుట్టిన రోజు వేడుకలను అభిమానులు బుధవారం ఘనంగా జరుపుకున్నారు. చిరు పుట్టినరోజు కానుకగా ‘సైరా’ టీజర్‌ను విడుదల చేయడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఈ టీజర్‌కు యూట్యూబ్‌లో 60 లక్షలపైన వ్యూస్ రావడం విశేషం. మరోవైపు సోషల్ మీడియాలో మెగాస్టార్‌కు పుట్టినరోజు సందర్భంగా బర్త్‌డే విషెస్ వెల్లువలా వచ్చాయి. అభిమానులే కాదు సినీ సెలబ్రిటీలు కూడా చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నాగార్జున, శ్రీకాంత్, అల్లుఅర్జున్, హరీష్ శంకర్, సుధీర్‌బాబు, రాధిక తదితరులు ట్విట్టర్‌లో మెగాస్టార్‌కు బర్త్‌డే విషెస్ తెలియజేశారు. ఇదిలాఉండగా పవన్‌కళ్యాణ్ తన భార్య పిల్లలతో కలిసి అన్నయ్య చిరంజీవికి వెళ్లి అందమైన పూల బొకే ఇచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భార్య అన్నా లెజ్నేవా, కూతురు పోలెనా, తనయుడు మార్క్ శంకర్‌తో కలిసి వెళ్లి పవన్ చిరును కలిశారు. బొకే ఇచ్చే సమయంలో చిరు ఆప్యాయంగా పవన్ మీద చేయి వేసి దిగిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

ఇక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీరాజాతో పాటు నరేష్, పరుచూరి వెంకటేశ్వరరావు, సురేష్ కొండేటి తదితరులు చిరంజీవిని ఆయన నివాసంలో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఇటీవల మోకాలుకి శస్త్ర చికిత్స చేయించుకున్న  టి.సుబ్బరామిరెడ్డిని ఆయన స్వగృహంలో చిరంజీవి కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా చిరంజీవికి సుబ్బరామిరెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ “సైరా..’ టీజర్ అద్భుతంగా ఉంది. సినిమా ఘన విజయం సాధించి చరిత్రలో నిలిచిపోతుంది”అని అన్నారు. ఇక మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో అభిమానుల సమక్షంలో చిరంజీవి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ను నిర్వహించారు. ఈ వేడుకలో అల్లు అరవింద్, రామ్‌చరణ్, అల్లు అర్జున్, వరుణ్‌తేజ్, సాయిధరమ్‌తేజ్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments