Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

లారెన్స్ తల్లి గుడి కోసం రూ.3 లక్షలు ఇచ్చిన మెగాస్టార్

Chiru-and-Raghava

డ్యాన్సర్ నుంచి డైరెక్టర్ వరకు ఎదిగిన లారెన్స్ రాఘవ…  జీవితంలో ఈ స్థాయికి చేరడానికి కారణం తన తల్లి అనే విషయాన్ని నిర్మొహమాటంగా చెబుతాడు. ఆమె కారణంగానే తాను నేడు ఈ స్థాయిలో ఉన్నానని చెప్పే లారెన్స్… తల్లి కోసం ఓ గుడి కట్టేశాడు కూడా. చిన్నప్పుడు లారెన్స్‌కు బ్రెయన్ ట్యూమర్ వస్తే అతని తల్లి తీసుకున్న జాగ్రత్తల కారణంగానే తిరిగి కోలుకున్నాడు. అందుకే ఆమెకు గుడి కట్టాలని నిర్ణయించుకున్న లారెన్స్… అమ్మ గుడిని మే 1న ప్రారంభించబోతున్నాడు.

“ఈ గుడి నిర్మాణం కోసం నేడు ముగ్గురి దగ్గరి నుంచి విరాళాలు తీసుకున్నాను. పి.వాసు లక్ష, ఆర్.బి.చౌదరి  వేలు ఇవ్వగా… చిరంజీవి అన్నయ్య రూ.3 లక్షల రూపాయలు ఇచ్చారు. ఇలా విరాళాలు తీసుకోవడానికి కారణం ఒకే వ్యక్తి గుడి కట్టకూడదు అని దర్శకుడు వాసు చెప్పడమే. అందుకే ఈ విరాళాలు తీసుకున్నాను”అని లారెన్స్ చెప్పాడు.  “ఇలా అమ్మకు గుడి కట్టాలనే ఆలోచన వచ్చినప్పుడు బతికి ఉన్నవారికి కట్టవచ్చా లేదా అనే సందేహం కలిగింది. తల్లిదండ్రులు చనిపోయాక చాలా మంది గుడి కడుతుంటారు. కానీ నేను అమ్మ ఉండగానే కట్టాలని నిర్ణయించుకున్నా. ఈ విషయంపై చాలా మంది దగ్గరే సలహాలు, సూచనలు తీసుకున్నాకే గుడి కట్టాను”అని పేర్కొన్నాడు లారెన్స్.

Comments

comments