Home ఆఫ్ బీట్ మెగాస్టార్ చిరంజీవి… ఖైదీ నంబర్ 150 మూవీ రివ్యూ!

మెగాస్టార్ చిరంజీవి… ఖైదీ నంబర్ 150 మూవీ రివ్యూ!

khaidino150

దాదాపు 10 ఏళ్ల తర్వాత ముఖానికి మేకప్ వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి…. మెగా అభిమానులను అలరించడానికి ఖైదీనెం150 తో ప్రేక్షకుల ముందుకు బుధవారం వచ్చాడు.

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా రిలీజయిన ఈ మూవీ… మరో రికార్డును క్రియేట్ చేసిందా లేదా? ఎ.ఆర్ మురగదాస్ తమిళంలో తెరకెక్కించిన సూపర్‌హిట్ సినిమా ‘కత్తి’ రిమేక్‌ లో మెగాస్టార్ మరోసారి ద్విపాత్రాభినయంతో తనదైన శైలీలో అలరించాడా లేదా? రైతు సమస్యలే ప్రధాన అంశంగా సాగిన ఈ మూవీ ని వి.వి.వినాయక్ తనదైన స్టైల్ తో మెగాస్టార్‌ని మరోసారి తెరపై అద్భుతంగా ఆవిష్కరించాడా లేదా? కాజల్ అగర్వాల్ తన గ్లామర్‌తో అభిమానుల్ని కట్టిపడేసిందా లేదా? తెలుగులో తొలిసారి అడుగుపెట్టిన తరుణ్ అరోరా విలన్ పాత్రకు తగిన న్యాయం చేశాడా లేదా? ఇక అలీ, బ్రహ్మానందం, రఘుబాబు, పోసాని కృష్ణమురళీ తదితరులు వెండితెరపై నవ్వులు పండించారా లేదా? తెలుసుకోవాలంటే మీరు రివ్యూ చదవాల్సిందే?.

అసలు కథ ఇది…

కత్తి శ్రీను (చిరంజీవి) కలకత్తాలోని ఓ జైలులో ఖైదీగా శిక్ష అనుభవిస్తూ ఉంటాడు. జైలర్ సహాయంతో… అక్కడి నుంచి తప్పించుకొని హైదరాబాద్‌కి వస్తాడు. కాని, పోలీసుల నుంచి తప్పించుకొనేందుకు హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ పారిపోదామని ప్లాన్ చేస్తాడు. ఈ క్రమంలో లక్ష్మి (కాజల్ అగర్వాల్)ని కలుస్తాడు.

మొదటి చూపులోనే లక్ష్మి ప్రేమలో పడ్డ శీను… బ్యాంకాక్ ప్రయాణాన్ని రద్ధు చేసుకొని తనను వెతకడం ప్రారంభిస్తాడు. ఈ సమయంలో శీను ఒక చోట ఉండగా కొందరు వ్యక్తులు ఓ వ్యక్తిపై కాల్పులు జరిపి పారిపోతారు. అది చూసిన శ్రీను అతడిని కాపాడేందుకు వెళ్తాడు.. తీరా చూస్తే అతడు అచ్చం శ్రీనులాగా ఉన్న శంకర్ (చిరంజీవి).. వెంటనే హాస్పిటల్ లో చేర్పించి… తను ఎస్కేప్ అవడం కోసం శంకర్‌ని పోలీసులకు పట్టిస్తాడు.

తిరగి బ్యాంకాక్‌కు వెళ్దామని ప్రయత్నించిన శ్రీనుని… శంకర్‌గా భావించిన ఓ కలెక్టర్.. ఓ వృద్ధాశ్రమంకి తీసుకెళ్తాడు. అక్కడ ఉన్నవారంతా నీరూరు అనే ఊరికి చెందిన రైతులు.. కార్పొరేట్ సంస్థల అధిపతి అగర్వాల్ (తరుణ్ అరోరా) ఆ ఊరి రైతుల భూములను కాజేసి అక్కడ ఫ్యాక్టరీ పెట్టాలని ప్రయత్నిస్తుంటాడు. దీనికి శంకర్ అడ్డుపడుతాడు. అందుకే శంకర్ ను చంపించడానికి ప్రయత్నిస్తాడు అగర్వాల్. అయితే ప్రస్తుతం శంకర్ స్థానంలో ఉన్న శ్రీనుని అగర్వాల్ తన వద్దకు పిలిపించి రైతుల భూముల్ని తనకు ఇచ్చేలా మాట్లాడి అతనికి రూ.25 కోట్లు ఇస్తాడు. డబ్బుకు ఆశపడి శ్రీను దీనికి సరే అంటాడు.

అదే సమయంలో శంకర్‌కు ఓ సన్మాన కార్యక్రమం జరుగుతుంది. అప్పుడే శంకర్ గురించి అసలు నిజాలు తెలుసుకుంటాడు శీను. అసలు శంకర్ ఎవరు? నీరూరు రైతులకు ఉన్న సమస్యలు ఏంటీ అనే విషయం తెలుసుకున్న శీను..రైతుల కోసం పోరాడటం ప్రారంభిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు శంకర్ ఏం అయ్యాడు? శ్రీను..లక్ష్మి ప్రేమ కథ ఏమైంది? అగర్వాల్‌పై రైతులు విజయం సాధించారా? లేదా.. అనే విషయాలు తెలుసుకోవాలంటే వెండితెరపై సినిమా చూడాల్సిందే..

ఇక… మిగితా పాత్రల్లో నటించిన కాజల్, అలీ, బ్రహ్మానందం, రఘుబాబు, విలన్ తరుణ్ అరోరా, పోసాని కృష్ణమురళి తమ పరిధి మేరకు నటించారు.

ప్లస్‌లు :

మెగాస్టార్ చిరంజీవి
కథ.. స్క్రీన్‌ప్లే
మ్యూజిక్.. డ్యాన్స్
విలన్
మైనస్‌లు :

హీరోయిన్ పాత్రకి ప్రాధాన్యత లేకపోవడం
క్లైమాక్స్