Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

టిడిపిలోకి మెగాస్టార్?

Chiru-Babuమాజీ కేంద్ర మంత్రి, సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి టిడిపి తీర్థం పుచ్చుకోనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయన త్వరలో సైకిల్ ఎక్కనున్నారట. ఈ మేరకు చిరంజీవిని ఎపి సిఎం తనయుడు, టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కలిసినట్లు సమాచారం. నారా లోకేష్ చిరును కలిసి పార్టీలోకి ఆహ్వానించిగా, ఆయన అందకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 5న మంచి ముహూర్తం ఉందని ఆ రోజు ఎపి సిఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో అమరావతిలో ఆయన టిడిపిలో చేరనున్నారట. ప్రస్తుతం 150వ చిత్రం ‘ఖైదీ నెంబర్ 150’ షూటింగ్‌లో బిజీగా ఉన్న చిరు అటు సినిమాలతో పాటు ఇటు రాజకీయాలపై కూడా దృష్టి సారిస్తున్నారని విశ్వసనీయవర్గాల సమాచారం. తనకు ఎటువంటి పదవీ అవసరం లేదని, రాజ్యసభ సభ్యుడిగానే కొనసాగుతానని చిరు లోకేష్‌తో చెప్పారట.. మరి నిజంగానే చిరు టిడిపిలో చేరుతారో.. లేదో.. వేచి చూడాల్సిందే.

Comments

comments