Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

‘మెగాస్టార్’కు 30 ఏళ్లు

Chiru

టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఆయన కెరీర్‌లో ఎన్నో సూపర్‌హిట్ సినిమాలున్నాయి. ఈ ఘన విజయాలతో ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అయితే చిరంజీవి పేరుకు ముందు మెగాస్టార్ అనే బిరుదును జత చేసి సరిగ్గా 30 ఏళ్లు పూర్తయింది. 1988 ఆగస్టు 4న సూపర్‌హిట్ మూవీ ‘మరణమృదంగం’ విడుదలైంది. ఈ చిత్ర నిర్మాత కె.ఎస్.రామారావు సినిమా విడుదల సందర్భంగా చిరంజీవి పేరుకు ముందు మెగాస్టార్ అనే బిరుదును జత చేశారు. అప్పటిదాకా సుప్రీమ్ హీరో, డైనమిక్ హీరో అంటూ రకరకాల ట్యాగులతో చిరు పేరును వాడుకున్న దర్శక నిర్మాతలు ‘మరణమృదంగం’ తర్వాతే మెగాస్టార్ అని ఫిక్స్ అయిపోయారు. ఈ సినిమా విడుదలై 30 ఏళ్లు పూర్తయింది. అంటే చిరంజీవి పేరుకు ముందు మెగాస్టార్ అని సిల్వర్‌స్క్రీన్ మీద పడి మూడు దశాబ్దాలు అయింది. ఈ సందర్భంగా చిరు అభిమానులు సోషల్ మీడియాలో ఈ సినిమా తాలూకు జ్ఞాపకాలను పోస్టర్లతో షేర్ చేసుకుంటూ మెగాస్టార్ బిరుదు ఎలా వచ్చింది అనే దాని గురించి చర్చించుకుంటున్నారు. యండమూరి వీరేంద్రనాథ్ నవల ఆధారంగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ‘మరణమృదంగం’ చిత్రం రూపొందింది. ఇళయరాజా సంగీతం ప్రధాన ఆకర్షణగా రూపొందిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ను హిట్‌ను అందుకొని భారీ కలెక్షన్లను సాధించింది.

Comments

comments