Home సినిమా సౌతిండియాలో మెగాస్టారే టాప్ 

సౌతిండియాలో మెగాస్టారే టాప్ 

మనం ఏ విషయం గురించి తెలుసుకోవాలన్నా వెంటనే గూగుల్‌ను తలచుకుంటాం. గూగుల్ సెర్చ్‌లో అన్ని విషయాల గురించి తెలుసుకోగలుగుతున్నాం. అయితే ఈ గూగుల్ సెర్చ్‌లో సినీ స్టార్ల ఫొటోలను కూడా ఎక్కువ చూస్తుంటారు. తాజాగా గూగుల్ వారు 2018కి గానూ సెర్చ్ ట్రెండ్స్ రిలీజ్ చేశారు. ఇందులో టాప్ ట్రెండింగ్ సౌతిండియన్ మూవీ స్టార్స్-2018 విభాగంలో మన మెగాస్టార్ చిరంజీవి మొదటి స్థానంలో నిలిచారు. ఈ ఏడాది చిరంజీవి నటించిన సినిమాలేవీ విడుదల కాలేదు కానీ భారీ బడ్జెట్ పీరియాడిక్ ఫిలిం ‘సైరా’ కారణంగా మెగాస్టార్ గురించి జనాలు విపరీతంగా సెర్చ్ చేశారట. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ బ్రిటీష్ కాలంనాటి సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇదిలాఉండగా చిరంజీవి తర్వాత స్థానాల్లో నాని, నందమూరి బాలకృష్ణ, విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న, అనసూయ నిలిచారు.

Megastar Is Top In South Indian Film Industry

Telangana news