Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

‘మీలో ఎవరు కోటీశ్వరుడు’తో బుల్లితెరపైకి వస్తున్నాః చిరంజీవి

chiruస్టార్ ఇండియా తన పోర్ట్‌పోలియో ఛానల్ మా టివి కొత్త లోగో, బ్రాండ్ ట్యాగ్‌లైన్, న్యూమోనిక్ థీమ్ ట్రాక్‌ను హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆవిష్కరించింది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై కొత్త లోగో, ట్యాగ్‌లైన్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్టార్ ఇండియా సౌతిండియా సిఇఒ కెవిన్ వాజ్ మాట్లాడుతూ “టివి రంగంలో వృద్ది చెందడంతో పాటు బ్రాండ్‌ను విస్తరించుకోవాలనే స్టార్ లక్షంలో భాగంగానే మా టివిని సొంతం చేసుకున్నాం. మారుతున్న ప్రేక్షకుల అభిరుచులు, అంచనాలకు అనుగుణంగా ఛానల్‌ను తీర్చిదిద్దుకోవడంలో భాగంగా కొత్తదనంతో కూడిన వైవిధ్యమైన కార్యక్రమాలను రూపొందిస్తున్నాం”అని అన్నారు. మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ “దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత సినీ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చాను. ఇప్పుడు బుల్లితెరపై అడుగుపెడుతున్నాను. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ప్రోగ్రామ్‌తో బుల్లితెర ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. ఈ షో చేసేటప్పుడు మరచిపోలేని అనుభూతులు కలుగుతున్నాయి. ఈ ప్రోగ్రామ్ కోసం పేదవాడి నుండి డబ్బున్నవారి వరకు చాలా మందిని కలవడం జరుగుతోంది. ఇదొక ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్ కాదు ఎమోషనల్ ప్రోగ్రామ్. ఈ షోకు ప్రేక్షకులతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా వస్తారు. నాగార్జున, వెంకటేష్‌లు అతిథులుగా వస్తున్నారు. అలాగే నందమూరి బాలకృష్ణను కూడా ప్రోగ్రామ్‌లో పాల్గొనవలసిందిగా కోరుతాం”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మా యూనిట్ బిజినెస్ హెడ్ అలోక్ జైన్ పాల్గొన్నారు.

Comments

comments