Home సినిమా హ్యూమాకు మెగా ఆఫర్

హ్యూమాకు మెగా ఆఫర్

Huma-Qureshi

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రీకరణ ఒకవైపు జరుగుతుండగానే మరోవైపు ఆయన 152వ చిత్రానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. చిరంజీవి తదుపరి చిత్రాన్ని  స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించబోతున్నారు. ప్రస్తుతం కొరటాల ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్‌లో బిజీగా ఉన్నట్లుగా తెలిసింది. ప్రస్తుతం ఈ చిత్రం కోసం హీరోయిన్ ఎంపిక జరుగుతోంది. చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ‘ఖైదీ నంబర్ 150’లో కాజల్ నటించగా… ప్రస్తుతం ‘సైరా’లో నయనతార హీరోయిన్‌గా చేస్తోంది. ఇక చిరు నెక్స్ మూవీకి  శ్రియా, అంజలి, అనుష్క మినహా పెద్దగా ఎవరూ లేరు. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు లేదంటే మళ్లీ కాజల్‌ను చిరంజీవికి జోడీగా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని అంతా భావించారు. కానీ తాజా సమాచారం ప్రకారం కొరటాల శివ ఈ చిత్రం కోసం బాలీవుడ్ బ్యూటీ హ్యూమ ఖురేషీని సంప్రదించారని తెలిసింది. హ్యూమ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని ఆయన భావించారు. ఇక హ్యూమ ఖురేషి ఈ చిత్రానికి ఓకే చెప్పిందని తెలిసింది. అందంతో పాటు మంచి ప్రతిభ ఉన్న ఈ భామ చిరుకు జోడీగా నటించనుంది.

Megha Offer To Bollywood Actress Huma Qureshi

Telangana News