Home జాతీయ వార్తలు ఉప ఎన్నికల్లో మేఘాలయ సిఎం విజయం

ఉప ఎన్నికల్లో మేఘాలయ సిఎం విజయం

Meghalaya CM Conrad Sangma won in the By Elections

షిల్లాంగ్ : మేఘాలయ సిఎం, ఎన్‌పిపి చీఫ్ కాన్రాడ్ సంగ్మా ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. దక్షిణ తురా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన కాంగ్రెస్ అభ్యర్థి ఛార్లెట్ డబ్లూ మోమిన్‌పై 13,600 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సంగ్మా గెలుపుతో మేఘాలయ అసెంబ్లీలో ఎన్‌పిపి సంఖ్యాబలం 20కి పెరిగి కాంగ్రెస్‌తో సమానమైంది. ఈ ఏడాది మార్చిలో మేఘాలయ అసెంబ్లీకి ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికలోల ఎన్‌పిపి 19, కాంగ్రెస్ 20 సీట్లను గెలుచుకున్నాయి. బిజెపి , ఎన్‌సిపి, ఇతర చిన్న పార్టీలతో కలిసి ఎన్‌పిపి మేఘాలయ డెమోక్రటిక్ అలియన్స్‌గా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో కాన్రాడ్ సంగ్మా సిఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన సిఎంగా కొనసాగాలంటే ఆరు నెలల్లో ఎంఎల్‌ఎగా గెలువాల్సిన అవసరం ఉంది. దీంతో మార్చిలో జరిగిన ఎన్నికల్లో దక్షిణ తురా నుంచి ఎంఎల్‌ఎగా గెలిచిన సంగ్మా సోదరి అగధ సంగ్మా తన పదవికి రాజీనామా చేయడంతో ఆయన ఇక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు.