Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

పాత పూరీని పరిచయం చేశాడు…(మెహబూబా ట్రైలర్)

Mehbooba Theatrical Trailer

హైదరాబాద్: టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఆయన తనయుడు ఆకాష్ పూరీ హీరోగా వస్తున్న తాజా చిత్రం ‘మెహబూబా’. సోమవారం ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. యుద్ధం నేపథ్యంలో సాగే ప్రేమకథాంశంగా ఈ మూవీ తెరకెక్కింది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్స్ తో పాటు.టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక తాజాగా విడుదలైన ట్రైలర్ కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. థియేట్రికల్ ట్రైలర్ లో “దేశాన్ని ప్రేమించే మనసు కేవలం ఒక్క సైనికుడికే ఉంటుంది .. ఆ మనసులో చిన్న స్థానం దొరికినా చాలు”,  “అసలు ఈ సరిహద్దులనేవి లేకుంటే ఎంత బాగుండేది”, “మమ్మల్ని చంపేస్తే మళ్లీ పుడతాం .. మళ్లీ మళ్లీ పుడతాం” అనే  డైలాగ్స్ చాలా బాగున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ సందీప్ చౌతా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ఆకాష్ సరసన నేహా శెట్టి హోరోయిన్ గా చేస్తోంది. వచ్చే నెల 11న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Comments

comments