Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

ఆ కథానాయికల సరసన…

Mehreen Kaur and Tamanna Joins in F2 Movie Shooting

సమంత, కీర్తిసురేష్, అనుపమా పరమేశ్వరన్ తదితర కథానాయికలంతా ఇప్పుడు సొంతగా డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. ఈ జాబితాలో తాజాగా పూజాహెగ్డే కూడా చేరింది. ఆమె నటిస్తున్న ‘అరవింద సమేత..’కు సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది. ఇక ఇప్పుడు మరో కథానాయిక ఈ జాబితాలో చేరబోతోంది. ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన అందాల తార మెహ్రీన్. ఇప్పటివరకు 7 సినిమాలు చేసినా ఒక్క చిత్రానికి కూడా డబ్బింగ్ చెప్పుకోలేకపోయింది. ఈ పంజాబీ అమ్మాయి ఇప్పుడు తన గొంతును వినిపించడానికి సిద్ధమవుతోంది. వెంకటేష్, వరుణ్‌తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ‘ఎఫ్2’ చిత్రంలో నటిస్తోంది ఈ భామ. వరుణ్‌కు జోడీగా నటిస్తోంది మెహ్రీన్. ఈ సినిమాలో తన పాత్రకు సొంతంగా డబ్బింగ్ చెప్పనుంది ఈ బ్యూటీ. ఈ చిత్రంలో మెహ్రీన్ పాత్ర ఎంటర్‌టైనింగ్‌గా ఉండనుంది.

Comments

comments