Home టెక్ ట్రెండ్స్ రూ.4,999 ధరకే స్మార్ట్ ఫోన్…

రూ.4,999 ధరకే స్మార్ట్ ఫోన్…

Meizu C9 Smartphonesముంబయి: ప్రముఖ మెయ్‌జు మొబైల్ సంస్థ బుధవారం ఇండియన్ మార్కెట్లో కొత్త స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లతో కేవలం రూ.4,999 ధరకే ‘మెయ్‌జు సి9’ పేరిట మార్కెట్లోకి వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్ సైట్లో ప్రత్యేకంగా అందుబాటులో ఉంది. ఈ ఫోన్ పై అమెజాన్ కొనుగోలుదారులు, జియో వినియోగదారులు బంపర్ ఆఫర్లను ప్రకటించింది సంస్థ. అమెజాన్ కొనుగోలుదారులకి వోచర్ల రూపంలో రూ.2,200 ఇవ్వగా…. జియో కస్టమర్లు 50 జిబి డేటా లభిస్తోంది.

‘మెయ్‌జు సి9’ అద్భుత ఫీచర్లు…

5.45″ హెచ్‌డి ప్లస్ డిస్ప్లే (1400 x 720 పిక్సల్స్)

2 జిబి ర్యామ్,16 జిబి ఇంటర్నల్ స్టోరేజ్

ఆండ్రాయిడ్ 8.0 ఆపరేటింగ్ సిస్టం

13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా

8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

ఫేస్ అన్‌లాక్, క్వాడ్‌కోర్ ప్రాసెసర్

3000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి అద్భుత ఫీచర్లు ఈ ఫోన్ లో అందుబాటులో ఉన్నాయి.

Meizu C9 Smartphones Launched